bollywood: ఈ టాపిక్ లో రామ్ చరణ్ అంటే జాన్వీ కి చాలా ఇష్టమట !

శ్రీదేవీ కూతురు కాబట్టి చిన్న చిన్న సినిమాలకు తన దగ్గరకు వెళ్లరు..పెద్ద పెద్ద స్టార్ హీరోలకే అడుగుతారు కాబట్టి టాప్ రేంజ్ కి తప్పక వస్తుందనే లాజిక్ కూడా చెప్తున్నారు. 


Published Oct 01, 2025 12:46:00 PM
postImages/2025-10-01/1759303439_tbg2ced4peddi625x30023May25.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రజెంట్ తెలుగు , హిందీ బాషల్లో లైన్ గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ తెలుగులో దేవరతో తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయ్యింది. ఇప్పుడు అమ్మడు రామ్ చరణ్ తో  " పెద్ది " సినిమా చేస్తుంది. ఇక ఈ సినిమాతో తెలుగు లో టాప్ హీరోయిన్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయంటున్నారు సినీ వర్గాలు..శ్రీదేవీ కూతురు కాబట్టి చిన్న చిన్న సినిమాలకు తన దగ్గరకు వెళ్లరు..పెద్ద పెద్ద స్టార్ హీరోలకే అడుగుతారు కాబట్టి టాప్ రేంజ్ కి తప్పక వస్తుందనే లాజిక్ కూడా చెప్తున్నారు. 


అయితే పెద్దిసినిమాపై జాన్వీ కపూర్ ఓ ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ వర్కింగ్ స్టైల్ కు నేను ఫిదా అయిపోయానంటూ కామెంట్ చేశారు.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'లో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. " బుచ్చిబాబు సనా డైరక్షన్ లో పనిచెయ్యం నిజంగా నా కెరియర్ కు మంచి హెల్ప్ అవుతుంది. ఉప్పెన చూశా ..చాలా ఎమోషనల్ మూవీ ...సౌత్ యాక్టర్స్ తో పనిచెయ్యడం నాకు చాలా హెల్ప్ అవుతుంది. వారికి చాలా డెడికేషన్ ఉంటుందంటూ చెప్పుకొచ్చింది.


ఇక రామ్ చరణ్ సార్ అయితే రోజు సెట్ కి ఓ విద్యార్ధిలా వస్తారు. ఎంత ఎనర్జీ , హానెస్టీ అంకితభావం చూసి నేనెంతో ప్రేరణ పొందాను . ఆయన తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో వస్తున్న " పెద్ది నుంచి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ షాట్ టీజర్ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చింది. ఒక్క షాట్ తో సినిమా మీద అంచనాలు పెంచేశాడు. పొలాల్లో పరిగెత్తడం , యాక్షన్ సీన్స్ , క్రికెట్ షాట్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. చరణ్ గెటప్ , డైలాగ్ డెలివరీ విజయనగరం యాసలో బాడీ లాంగ్వేజ్ అధ్భుతంగా ఆకట్టుకున్నాయి. బుచ్చిబాబు విజన్ , రత్నవేల్ విజువల్స్ , ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ టీజర్ కు హైలెట్ గా నిలిచాయి. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చి 27 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక చరణ్ ఫ్యాన్స్ మార్చి కోసం ఇగర్ గా వెయిట్ చేస్తున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu janhvi-kapoor bollywood

Related Articles