JS Voice : రాజగోపాల్ రెడ్డి గురించి జర్నలిస్ట్ శంకర్ ఏమన్నారంటే...

జర్నలిస్ట్ శంకర్ (Journalist Shankar) గురువారం రోజు తన మార్నింగ్ న్యూస్ విశ్లేషణ(Morning News Analysis)లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ప్రత్యేకంగా విశ్లేషణ చేశారు. గత కొన్ని రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. 


Published Sep 18, 2025 12:11:10 PM
postImages/2025-09-18/1758212956_01.PNG

జర్నలిస్ట్ శంకర్ (Journalist Shankar) గురువారం రోజు తన మార్నింగ్ న్యూస్ విశ్లేషణ(Morning News Analysis)లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ప్రత్యేకంగా విశ్లేషణ చేశారు. గత కొన్ని రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. రగులుతున్న రాజగోపాల్ అనే శీర్షికన "తెలంగాణం" పత్రిక రాసిన కథనంపై ఆయన ప్రత్యేకంగా విశ్లేషించారు. ప్రధానంగా సెప్టెంబర్ 17 సందర్భంగా గన్ పార్కుకు వచ్చిన రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకపోతే నేపాల్ లో అక్కడి ప్రభుత్వంపై తిరగబడ్డట్టు తిరగబడతారు అన్న వ్యాఖ్యలపై శంకర్ పూర్తిస్థాయిలో విశ్లేషణ చేశారు. మీరు ఆ విశ్లేషణను కింద ఉన్న లింకులో చూడవచ్చు.