KARNATAKA : ఓజీ కి కర్ణాటక లో నిరసన సెగ.. బాయ్ కాట్ అంటున్న కన్నడప్రజలు !

ఏ సినిమా రిలీజ్ అయినా బాయ్ కాట్....నిరసనలు ఇప్పుడు ప్రాంతీయ సినిమాలు అన్న పదం పోయి.. పాన్ ఇండియా సినిమాలు వచ్చి దున్నేస్తున్నాయి


Published Sep 25, 2025 03:11:00 PM
postImages/2025-09-25/1758793434_TheyCallHimOGreview17587791033131758779122695.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సౌత్ సినిమాలకు ఇప్పుడు చాలా మంచి క్రేజ్ ఉంది. అయితే సౌత్ సినిమాల్లో ఏ మంచి సినిమా రిలీజ్ అయినా సౌత్ సినిమానే కదా..పేరు సౌత్ ఇండస్ట్రీకే కదా ..కాని కర్ణాటక జనాలు మాత్రం వేరేలా ఉంటారు. ఒకప్పుడు తమిళనాడు వారు ఇలా ఉండేవారు ఇప్పుడు కర్ణాటక జనాలు . ఏ సినిమా రిలీజ్ అయినా బాయ్ కాట్....నిరసనలు ఇప్పుడు ప్రాంతీయ సినిమాలు అన్న పదం పోయి.. పాన్ ఇండియా సినిమాలు వచ్చి దున్నేస్తున్నాయి. అయినా జనాలు మారడం లేదు. ఈ వివక్ష అంతా సౌత్ ఇండస్ట్రీల్లోనే ..ఎందుకో ఈ పైత్యం.


కంటెంట్ నచ్చితే ఇంగ్లీష్ సినిమాలను, హీరోలను కూడా నెత్తిన పెట్టుకున్న చరిత్ర తెలుగువారి సొంతం. అంతెందుకు కాంతార తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ . మరి మన ఆర్ ఆర్ ఆర్ కాని బాహుబలి కాని ...ఇప్పడు ఓజీ కాని నిరసన సెగలే . కర్ణాటకలో థియేటర్లు దొరకకుండా చేస్తున్నారు. తమిళనాడులోని ఇదే పరిస్థితి. మన వాళ్లు మాత్రం ఆర్టిస్ట్ ని డైరక్టర్ ను ఎంత మెచ్చుకుంటారు. సినిమా బాగుంటే చాలు ...పట్టం కడతారు. తెలుగు తెర అంతా శాండిల్ వుడ్ తారలే. నిజానికి టెలివిజన్ లో అయితే తెలుగు ఆర్టిస్ట్ లే తక్కువ అయిపోయారు. అలా అయినా శాండిల్ వుడ్ జనాలు ఇంకా తెలుగు సినిమాలపై అక్కసు కక్కుతూనే ఉన్నారు.


చాలా కాలంగా కన్నడ భాష అస్థిత్వాన్ని కాపాడుతున్నామనే వంకతో కొన్ని సంఘాలు గత కొంతకాలంగా ఓవరాక్షన్ చేస్తున్నాయి. బెంగుళూరులో బాష కోసం గొడవలు పడుతుంటారు. కొత్త సినిమా ఏదైనా తెలుగు సినిమా అయితే చాలు దీనిపై బాయ్ కాట్ ..అది కంటెంట్ మంచిదా కాదా అనవసరం . అప్పుడు గేమ్ ఛేంజర్ కూడా ఇంతే. టైటిల్ పై నల్లరంగు పూయడం ..పోస్టర్లు చింపేయడం చేశారు. ఇప్పుడు ఓజీ కి బాయ్ కాట్ నడుస్తుంది.


బెంగళూరులోని సంధ్య థియేటర్ వద్ద ఓజీ ప్రీమియర్స్ ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. బెంగళూరులోని పవన్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సంబరాలు చేసుకోవడంతో థియేటర్ వద్ద సందడి నెలకొంది. కన్నడ కార్యకర్త ఒకరు థియేటర్ వద్ద ఓజీ ప్రదర్శన పై నిరసన వ్యక్తం చేశారు. ఇంతలో మరికొంతమంది కన్నడ కార్యకర్తలు అక్కడికి చేరి మరింత ఓవరాక్షన్ చెయ్యడం ఇప్పుడు వైరల్ అవుతుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pawan-kalyan karnataka- bengalore

Related Articles