జస్ట్ రూ.14 కోట్లతో తెరకెక్కిన ఈ కాంతార బాక్సాఫీస్ దగ్గర రూ.450 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కన్నడ ఇండస్ట్రీలో కాంతార చేసిన హంగామా మామూలుది కాదు. కేజీఎఫ్ ..కాంతార పాన్ ఇండియా మూవీస్ గా దుమ్ములేపేశాయి. కన్నడ ఇండస్ట్రీ సత్తా చాటిన మూవీ కాంతార. నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించింది. జస్ట్ రూ.14 కోట్లతో తెరకెక్కిన ఈ కాంతార బాక్సాఫీస్ దగ్గర రూ.450 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ చాలువే గౌడలు దాదాపు రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో కాంతార చాప్టర్ 1ను నిర్మిస్తున్నారు. రిషభ్ శెట్టి హీరోగా రుక్మీణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా కాంతార చాప్టర్ 1 ను రిలీజ్ చేస్తున్నారు. కన్నడ తో పాటు తెలుగు , తమిళ, బెంగాలీ , మలయాళం , హిందీ బాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది.
ఇక కాంతారకు కర్ణాటకతో సమానమైన ఆదరణ తెలుగు రాష్ట్రాల్లోనూ దక్కింది. ఈ క్రమంలోనే కాంతార చాప్టర్ 1 పైనా మన దగ్గర భారీ అంచనాలు నెలకొన్నాయి. కాంతార చాప్టర్ 1 తెలుగు థియేట్రికల్ రైట్స్ 100 కోట్లకు పైగా పలుకుతున్నాయట. తెలుగు లో 200 కోట్లు వసూలు చేస్తారని అంచనా వేస్తున్నారు.
అన్ని రాష్ట్రాల్లోను థియేట్రికల్ రైట్స్, ఆడియో, శాటిలైట్, ఓటీటీ రైట్స్ కలిపి కాంతార చాప్టర్ 1కు వరల్డ్ వైడ్‌గా 370 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పెట్టుబడి మీద 245 కోట్ల రూపాయిలు లాభం వచ్చినట్లు గా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 2 వరల్డ్ వైడ్ గా దాదాపు 7వేల థియేటర్లలో కాంతార చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది. అయితే ఇప్పటికే లాభాల్లో ఉంది .అమెరికాలో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఏకంగా 1.5 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రిలీజ్‌కు ఇంకా 6 రోజుల సమయం ఉండటంతో కాంతార చాప్టర్ 1కు మరిన్ని కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు.