BOLLLYWOOD: భర్త ఆస్థి కోసం కోర్టుకెక్కిన బాలీవుడ్ హీరోయిన్ !


బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త,  బడా బిజినెస్ మ్యాన్ సంజయ్ కపూర్ ఈ ఏడాది జూన్‌లో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన వయసు దాదాపు 53 ఏళ్లు. ఇంగ్లాండులో గార్డ్స్ పోలో క్లబ్ లో మ్యాచ్ ఆడుతూ సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు


Published Sep 24, 2025 05:23:00 PM
postImages/2025-09-24/1758714866_newproject20250910t1433270921757495019.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఆస్తుల కోసం కోర్టుకెక్కడం చాలా కామనే. అందులోను సెలబ్రెటీస్ మరీ ఘోరం మనకి తెలిసిందే కదా..అయితే చనిపోయిన భర్త ఆస్తి కోసం బాలీవుడ్ లో ఓ టాప్ హీరోయిన్ కోర్టులు చుట్టు తిరగడం ఇప్పుడు వైరల్ అవుతుంది. రీసెంట్ గానే సూపర్‌స్టార్ అమీర్ ఖాన్‌పై ఆయన సోదరుడు ఫైసల్ ఖాన్ పలు ఆరోపణలు చేయడంతో పాటు తనకు రావాల్సిన ఆస్తిపై కోర్టుకెక్కాడు. ఇప్పుడు కరీనాకపూర్ కూడా సేమ్ లైన్ లో నడుస్తుంది.


బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త,  బడా బిజినెస్ మ్యాన్ సంజయ్ కపూర్ ఈ ఏడాది జూన్‌లో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన వయసు దాదాపు 53 ఏళ్లు. ఇంగ్లాండులో గార్డ్స్ పోలో క్లబ్ లో మ్యాచ్ ఆడుతూ సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు . అయితే ఇండియన్ ఆటో మొబైల్ రంగానికి సంజయ్ కపూర్ సుపరిచితులు. సోనా కామ్ స్టార్ అనే సంస్థకు  సంజయ్ ఛైర్మన్ గా ఉన్నారు. స్పేర్ పార్ట్స్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడు కూడా..జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పలు పోలో పోటీలలో పాల్గొనడంతో పాటు ఆరియస్ అనే పోలో జట్టు కూడా సంజయ్ కపూర్‌కు ఉంది.


తొలుత నందిత మహతానీని పెళ్లాడిన సంజయ్ కపూర్.. 2000వ సంవత్సరంలో ఆమెకు విడాకులు  ఇచ్చి .... హీరోయిన్ కరిష్మా కపూర్‌ను సంజయ్ కపూర్ రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా సమైరా , కియార్ కపూర్ అయితే పర్సనల్ గొడవలతో 2016 లో విడిపోయారు. ఇప్పుడు సంజయ్ మరణం తర్వాత తన ఆస్తిలో వాటా రాకపోవడంతో కరిష్మా కపూర్ కోర్టుకు వెళ్లారు. అంతేకాదు కరిష్మా తో విడాకుల తర్వాత సంజయ్ మరో పెళ్లి చేసుకున్నారు. సంజయ్ ఆస్తులు ఇప్పుడు తన మూడవ భార్య అధీనం లో ఉన్నాయి. అది కూడా 3వేల కోట్ల ఆస్తులు . కరీష్మా పిల్లలకు ఆస్తులపై హక్కు ఉన్నా ..వీలునామా ను మార్చి ప్రియ తమకు ఏం దక్కకుండా చేస్తుందనేది కరీష్మా అలిగేషన్.


ఈ విషయంపై కరిష్మ పిల్లలు సమైరా, కియాన్‌లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే తమ తండ్రి మరణానంతరం ఆస్తి వివరాలు చెప్పడానికి కూడా ప్రియ ససేమిరా అన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇండియన్ లా ప్రకారం తండ్రి ఆస్తి పిల్లలకు దక్కుతుంది. సో ఈ వ్యవహారం ఢిల్లీ కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు బీటౌన్ లో చాలా హాట్ టాపిక్ అవుతుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu delhi bollywood karishma-kapoor high-tension

Related Articles