KARTHIKA DEEPAM : దీపపై మానవత్వం చూపించిన సుమిత్ర !

కార్ తీయమన్నప్పుడు తీయాలి. ఎక్కడికి ఏంటి అని అడగొద్దు అని పారిజాతం సెటైర్ వేస్తుంది. ఎక్కడికెళ్లాలో చెప్పకుండా ఏట్లోకి తీసుకెళ్లమంటావా అంటూ కార్తీక్ కూడా సెటైర్ వేస్తాడు. ఫైనల్ గా అక్కడి నుంచి వాళ్లు బయలుదేరుతారు. 

 


Published Sep 29, 2025 02:40:00 PM
postImages/2025-09-29/1759137340_509e0bfa4de145d3a1a60d71152468ce.jpg

కార్తీక దీపం సీరియల్..29-09-2025 


మళ్లీ కలిసిన సుమిత్ర, దీప


   న్యూస్ లైన్ ,  స్పెషల్ డెస్క్:   సీరియల్ స్టార్ట్ కాగానే..వంట గదిలో కార్తీక్ దీపలు వాళ్ల అమ్మానాన్నలు మెంటాలిటీ గురించి మాట్లాడుకుంటుంటారు. ఇద్దరూ ఇద్దరే మొండివారు..వాళ్లను ఎలాగైనా కలపాలి అనుకుంటారు. వీళ్ల మాటలు విన్న జ్యోష్ణ షాక్ అవుతుంది. అమ్మెవరో తెలియదు అనే దీప అమ్మానాన్నల గురించి మాట్లాడుకుంటున్నారు ఏంటా అని షాక్ అవుతుంది. కొంపదీసి సుమిత్రే వాళ్లమ్మ అని దీపకు తెలిసే ఛాన్స్ ఉందా అనుకుంటుంది జ్యోష్ణ. పారిజాతం కూడా జ్యోష్ణతోపాటు ఉంటుంది. దీనికి కంటిన్యూ చేస్తే మంచిది కాదు అని...బయటికెళ్లాలి పదా అంటుంది జ్యోష్ణ. ఎక్కడికెళ్లాలి అంటాడు కార్తీక్. కార్ తీయమన్నప్పుడు తీయాలి. ఎక్కడికి ఏంటి అని అడగొద్దు అని పారిజాతం సెటైర్ వేస్తుంది. ఎక్కడికెళ్లాలో చెప్పకుండా ఏట్లోకి తీసుకెళ్లమంటావా అంటూ కార్తీక్ కూడా సెటైర్ వేస్తాడు. ఫైనల్ గా అక్కడి నుంచి వాళ్లు బయలుదేరుతారు. 

కట్ చేస్తే..శ్రీధర్ వాళ్ల ఇంటికొస్తారు జ్యోష్ణ, పారిజాతం. నాతమ్ముడెక్కడ, నామనవడెక్కడా అంటూ వీళ్లిద్దరూ పిలుస్తుంటె. మీ తమ్ముడెవరూ మీ మనవడెవరూ అంటుంది స్వప్న. కాశీ ఎక్కడ అంటుంది జ్యోష్ణ. కాశీ నా భర్త అంటుంది స్వప్న. వాడు నీ భర్త కాకముందే నా మనవడు అంటుంది పారిజాతం. ఇదే టైంలో కాశీ లోపల్నుంచి వస్తాడు. కాశీ ఎన్నాళ్లిలా ఉంటావు. మన రెస్టరెంట్స్ లో మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది వచ్చి జాయిన్ అవ్వు అంటుంది జ్యోష్ణ. తను చదువుకున్న చదువుకు రెస్టరెంట్స్ మేనేజర్ జాబ్ చేయవలసిన అవసరం లేదు అంటారు శ్రీధర్ ఫ్యామిలీ వాళ్లు. సరే..కొత్తగా వచ్చిన ఐటీ కంపెనీలో మా ఫ్రెండ్ ఉన్నాడు. ఐటీ జాబ్ ఇప్పిస్తా అంటుంది జ్యోష్ణ. ఫోన్ కార్ లో మర్చిపోయాను...డ్రైవర్ ను తీసుకురమ్మని చెప్పు అని స్వప్నకు చెబుతుంది జ్యోష్ణ. ఇంటికొచ్చిన గెస్టులకు మర్యాద ఇవ్వాలి లేమ్మా, వెళ్లు అని స్వప్నను పంపుతాడు శ్రీధర్. స్వప్న బయటకు వెళ్లి, డ్రైవర్ మేడమ్ గారి ఫోను, హ్యాండ్ బ్యాగ్ తీసుకురా అంటుంది. అటు నుంచి సరే అంటూ కార్తీక్ కార్ పక్కనుంచి వస్తాడు. కార్తీక్ ను చూసిన స్వప్న ఫీల్ అవుతుంది. అన్నయ్యా నువ్వు కాదనుకున్నాను. వేరే డ్రైవర్ అని అలా పిలిచాను అంటుంది. సరేనమ్మా అంటాడు కార్తీక్. నువ్వేంటన్నయ్యా ఇక్కడున్నావు లోపలికి రాకుండా అంటూ స్వప్న కోపంగా వెళ్తుంది. మా అన్నయ్య ఉన్నాడని చెప్పకుండా డ్రైవర్ అని పిలిపించడంతో..స్వప్న ఫీల్ అవుతుంది. పంచాయితీ పెట్టుకుంటుంది. ఇదే టైంలో కార్తీక్ లోపలికి వస్తాడు. అదీ ఇదీ అని మాట్లాడుకుంటుంటారు. 


కట్ చేస్తే..ఈ టైంలో...దీప వంటింట్లో పడిపోతుంది. దీప వంటింట్లోకి వెళ్తున్నప్పుడు సుమిత్ర కూడా చూస్తుంది. వెంటనే వంట గదిలో కళ్లు తిరిగి పడిపోతుంది దీప. ఆ టైంలో...ప్లేట్స్ సౌండ్ రాగానే సుమిత్ర వింటుంది. ఏవో పడిపోయినట్లున్నాయి అనుకుంటుంది. కానీ..ప్లేట్స్ గ్లాసులు పడిపోతే ఇంత సౌండ్ రాదు కదా అని వచ్చి చూస్తే దీప పడిపోయి ఉంటుంది. కంగారు పడిపోయిన సుమిత్ర లేపే ప్రయత్నం చేయగా..దీప లేవదు. ఏం చేయాలో తెలియక కార్తీక్ కు ఫోన్ చేస్తుంది సుమిత్ర. ఎక్కడున్నావ్ రా..దీప కళ్లు తిరిగిపడిపోయింది అని చెబుతుంది సుమిత్ర. సరే నేను వస్తున్నా..ఏం ప్రాబ్లమ్ లేదులే..దీప రాత్రి నుంచి ఏమీ తినలేదు అంటాడు కార్తీక్. ఇక్కడ శ్రీధర్ వాళ్ల ఫ్యామిలీ వాళ్లు కూడా కంగారు పడతారు. వెళ్దాం పదండి అని..జ్యోష్ణ, పారిజాతం ను పిలుస్తాడు కార్తీక్. మా పని ఇంకా కాలేదు అంటుంది జ్యోష్ణ. అక్కడ నా భార్య కళ్లు తిరిగి పడిపోయింది. నేను వెళ్తున్నాను వస్తే రండి లేకుంటే లేదు అంటాడు కార్తీక్. దీంతో పారిజాతం కంగారు పడిపోయి వెళ్దాం పదా అంటుంది. ఖర్చులకు డబ్బు తీసుకో అని కాశీకి అమౌంట్ ఇవ్వబోతుంది జ్యోష్ణ. ఆ డబ్బును శ్రీధర్ తీసుకుని..మాకేం అవసరం లేదు. నా అల్లుడి ఖర్చులకు నేను డబ్బులు ఇవ్వగలను అంటాడు శ్రీధర్. తర్వాత జ్యోష్ణకే ఇస్తాడు. అక్కడి నుంచి వాళ్లు వెళ్లిపోతారు. 


ఇక్కడ చూస్తే..దీప అలాగే పడిపోయి ఉంటుంది. కార్తీక్ కు ఫోన్ చేసిన సుమిత్ర..వచ్చి దీపను లేపుతుంది. గ్లాస్ తో నీళ్లిస్తుంది. ఆ టైంలో..దీప చాలా ఎమోషనల్ అవుతుంది. స్పృహలోకి వచ్చిన దీప...వాళ్లమ్మే తనను లేపడం చూసి...మనసులోనే ఆనంద పడుతుంది. కానీ సుమిత్ర మాత్రం నార్మల్ గానే ఇబ్బందుల్లో ఉన్న ఆడ మనిషికి సాయం చేసినట్లు చేస్తుంది. తర్వాత దీపను కూర్చోబెట్టి ప్లేట్ లో బోజనం తీసుకొస్తుంది. కానీ తినిపించకుండా దీప చేతికి ఇస్తుంది. సాటి మనిషికి సాయం చేసేంత మానవత్వం ఉంది కానీ...తినిపించేంత ప్రేమలేదు అని దీపతో సుమిత్ర అంటుంది. ఇక్కడితో 29.09.2025 నాటి కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది

newsline-whatsapp-channel
Tags : newslinetelugu karthika-deepam deepa vantalakka

Related Articles