నువ్వు చేసే తప్పులు నా వల్ల కాకపోవచ్చు కానీ..నేను చేసే తప్పులు మాత్రం నీవల్లే అంటూ మాటలతో హింసపెట్టింది. ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలీక నానా టార్చర్ అనుభవించింది దీప.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పాపం దీప. వాళ్లమ్మే వచ్చి లేపుతుంటే హ్యాప్పీగా ఫీల్ అయింది. అన్నం పెడుతుంటే ఆనందం మురిసిపోయింది. కానీ..ఆ తర్వాత తెలిసింది సుమిత్రకు కోపం వస్తే ఎలా ఉంటుందో. తిను దీప తిను అంటూనే..ముద్ద దిగకుండా చేసింది. కూరతో తిను...పెరుగుతో తిను అంటూనే..నానా మాటలు అంటుంటే..పాపం దీప తినలేక పోయింది. ఏంటి ఆ కన్నీళ్లు, పెరుగులో ఉప్పు తక్కువైందని కన్నీళ్లు కలుపుకుంటున్నావా అంటూ...వామ్మో ఎన్నెన్ని మాటలు అన్నది సుమిత్ర. సాధించడం అంటె ఇదేనేమో అన్నట్లు చేసింది. నీ వల్లే మా పరిస్థితి ఇలా అయింది. నువ్వు చేసే తప్పులు నా వల్ల కాకపోవచ్చు కానీ..నేను చేసే తప్పులు మాత్రం నీవల్లే అంటూ మాటలతో హింసపెట్టింది. ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలీక నానా టార్చర్ అనుభవించింది దీప.
కట్ చేస్తే..కంగారు కంగారు గా ఇంటికి వస్తారు కార్తీక్, జ్యోష్ణ, పారిజాతాలు. కార్తీక్ అయితే ఎంతో కొంత హ్యాప్పీనే. కానీ...జ్యోష్ణ మాత్రం షాక్ అవుతుంది. అమ్మేంటి దీపకు అన్నం పెట్టింది. నీళ్లు తాగిస్తుంది అని. ఎక్కడికెళ్లావ్ రా కార్తీక్. నీ భార్యను చూసుకోవడం తెలియదా. ఇలాంటి పరిస్థితి ఇంకోసారి తీసుకురాకు అంటుంది. కార్తీకేమో..మీ అమ్మతో అన్నం పెట్టించుకుని తిన్నావు గా అంటూ దీపను ఆట పట్టిస్తాడు. లేదు బావా..అన్నం పెట్టినట్లు లేదు..నానా మాటలు అన్నది నన్ను. నన్ను చాలా బాధ పెట్టింది అని చెబుతుంటే..సరె సరెలే..ఏం కాదు. మొన్న మీ నాన్నకు కాఫీ ఇచ్చావు, ఇప్పుడు మీ అమ్మే నీకు అన్నం పెట్టింది. మనుషులు మారాలి అంటే మనసులు కదలాలి కదా. ఏదైనా మంచికేలే..నాకు అన్నం పెట్టు పద అంటాడు.
ఇటు చూస్తే..జ్యోష్ణకు ఉక్రోశంతో ఊగిపోతుంది. ఏం చేయాలో అర్దం కాని పరిస్థితిలో పడిపోతుంది. దీప, సుమిత్ర కలిస్తే తన పరిస్థితి ఏంటా అని కంగారు పడుతుంది. ఆ తల్లీ కూతుల్లో కలిస్తే ఎలా అని నోరు జారుతుంది పారిజాతంతో. ఏంటే అన్నావ్..తల్లీ కూతుళ్లు ఏంటి అని పారిజాతం అడుగుతుంది. వాళ్లిద్దరూ తల్లీ కూతుళ్లు అని పారిజాతానికి తెలియదు కదా అని తెలుసుకుని కవర్ చేసుకుంటుంది జ్యోష్ణ. నన్ను ఒంటరిని చేశావు నువ్వు అని పారిజాతాన్ని అంటే..నువ్వు కాశీ విషయంలో చేసిసన పనికి నిన్ను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అంటుంది పారిజాతం. కానీ..జ్యోష్ణ మాత్రం పారిజాతాన్ని రిక్వస్ట్ చేసుకుంటుంది. నేను వాళ్లిద్దర్నీ పట్టించుకుంటాను. నువ్వు నన్ను పట్టించుకో అంటుంది జ్యోష్ణ. పారిజాతం నమ్మకపోతే ఒట్టేస్తుంది కూడా. దీంతో వాళ్లిద్దరూ మళ్లీ ఒక జట్టవుతారు.
ఇక కాంచన ఇంట్లోనేమో ఇంకో ఇంట్రస్టింగ్ సీన్ జరిగింది. ఒక ఫ్యామిలీకి నెలకు సరిపడా సరుకులు, ఒక డబ్బుల కట్ట తీసుకుని వస్తాడు శ్రీధర్. ఇంట్లో పెట్టండి అని దీప మేనత్తతో అంటే..వద్దు లోపల పెట్టొద్దు అక్కా. నువ్వైతే లోపలికి వెళ్లు అంటుంది కాంచన. ఇదేం కొత్త పద్దతి. ప్రేమలు పుట్టుకొచ్చాయా అన్నట్లు మాట్లాడుతుంది కాంచన. నా బాధ్యతగా తెచ్చాను అని శ్రీధర్ ఎంత చెప్పినా వినదు. డబ్బు కూడా తీసుకోదు. కానీ శ్రీధర్ డబ్బు అవసరం గురించి చెబుతాడు. ఫ్యామిలీని కార్తీక్ పోషిస్తున్నాడు, వాడి గురించి నాకు తెలుసు. కానీ..ఏదో ఒక కష్ట కాలం వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం వచ్చినప్పుడు వాడు మాత్రం ఎక్కడికి వెళ్తాడు. డబ్బు ధైర్యం ఇస్తుంది, భరోసా ఇస్తుంది. నేను చేసిన తప్పులు క్షమించమని నిన్ను అడగడం లేదు. డబ్బైతే దగ్గర ఉంచు, కావాలంటే మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు నాకివ్వు, నేను తీసుకుంటాడు అంటాడు. భార్యకు భర్త డబ్బులిస్తే తీసుకున్నప్పుడు, భర్తకు భార్య డబ్బులిస్తే తీసుకోవడంలో కూడా తప్పులేదు. నువ్విస్తే కచ్చితంగా తీసుకుంటాను. బయటి వ్యక్తి ఇచ్చాడు అని అయినా తీసుకో, కార్తీక్ కు మాత్రం ఈ విషయం తెలియనివ్వకు అంటాడు శ్రీధర్. ఇదే టైంలో..ఏంటి మాస్టారూ ఇక్కడున్నారు అంటూ కార్తీక్, దీపలు వస్తారు. ఈ టైంలో కాంచన డబ్బు కార్తీక్ కంటికి కనిపించకుండా దాస్తుంది. దీంతో శ్రీధర్ హ్యాప్పీగా ఫీల్ అవుతాడు. కార్తీకేమో ఆ సరుకులేంటి ఎక్కడి నుంచి వచ్చాయి..నువ్వెళ్లావా పెద్దమ్మా, నేను కూడా షాప్ లో చెప్పలేదు కదా అంటాడు. దీంతో దీప మేనత్త మీ నాన్న తెచ్చాడు అంటుంది. ఆ టైంలో కార్తీక్ కూడా మనసులో హ్యాప్పీగానే ఫీల్ అయినట్లు అనిపిస్తాడు. కానీ...దీనిపై ఎలా రియాక్ట్ అవుతాడు అనేది మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాల్సిందే