విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న సినిమా టైటిల్ ‘కింగ్ డమ్’అని పెట్టారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ నిర్మిస్తోన్న చిత్రం ఇది
న్యూస్ లైన్ ,స్పెషల్ డెస్క్ : విజయ్ దేవరకొండ సినిమా నుంచి మొదటి సాంగ్ ప్రొమోని రిలీజ్ చేశారు. హృదయం లోపల అంటూ ఈ పాట సాగనుంది.ఫుల్ సాంగ్ మే 2 న రిలీజ్ అవ్వనుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రొమోలో ఓ బీచ్ లో కూర్చొని విజయ్ భాగ్యశ్రీకి లిప్ కిస్ ఇచ్చాడు. దీంతో ఈ ప్రోమో వైరల్ అవ్వగా మళ్లీ పాత విజయ్ ని గుర్తు చేస్తున్నాడు అని రౌడీ ఫ్యాన్స్ అంటున్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న సినిమా టైటిల్ ‘కింగ్ డమ్’అని పెట్టారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ నిర్మిస్తోన్న చిత్రం ఇది. చెప్పినట్టుగానే ఇన్ టైమ్ లోనే టైటిల్ టీజర్ విడుదల చేశారు. ఈ టైటిల్ టీజర్ కు తెలుగులో ఎన్టీఆర్ , తమిళ్ లో సూర్య, హిందీలో రణ్ బీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించారు.మిగతా భాషలేమో కానీ తెలుగులో ఎన్టీఆర్ వాయిస్ ఈ టీజర్ కు హైలెట్ అయింది. అలాగే అనిరుధ్ నేపథ్య సంగీతం నెక్ట్స్ లెవల్ లో కనిపిస్తోంది.