MP: ప్రాణం తీస్తున్న కాఫ్ సిరప్ ...మధ్యప్రదేశ్ లో 9 చిన్నారుల మృతి !

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో కలుషిత దగ్గు మందుల కారణంగా కేవలం పదిహేను రోజుల్లో ఏకంగా తొమ్మిది మంది పిల్లలు కిడ్నీ ఫెల్యూర్ తో చనిపోయారు.


Published Oct 03, 2025 12:52:00 PM
postImages/2025-10-03/1759476239_coughsyrupdeaths01140966316x91.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి...వాతావరణ మార్పులు మొదలవుతున్నాయి. పిల్లలకు ..పెద్దోళ్లకు జ్వరాలు ..దగ్గులు స్టార్ట్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో మధ్యప్రదేశ్ లో  సాధారణ దగ్గుమందు వాడి తొమ్మిదిమంది ప్రాణాలు పోయాయి. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో కలుషిత దగ్గు మందుల కారణంగా కేవలం పదిహేను రోజుల్లో ఏకంగా తొమ్మిది మంది పిల్లలు కిడ్నీ ఫెల్యూర్ తో చనిపోయారు.


ఛింద్వాడా జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నార్మల్ ఫీవర్ గా స్టార్టయ్యి ...లైఫ్ రిస్క్ గా మారుతున్న ఈ కేసులను డీప్ లెవెల్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటివరకు తొమ్మిది మంది చిన్నారులు మరణించినట్లు పరాసియా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ శుభం యాదవ్ ధ్రువీకరించారు. అయితే చనిపోయిన చిన్నారులలో ఐదుగురు నెక్స్ ట్రో ..కోల్డ్ రిలీఫ్ లాంటి సిరప్ లు వాడరని దీని వల్లే జరిగిందేమో అనే యాంగిల్ కూడా ఉందని అంటున్నారు. దీంతో పాటు డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ ఉన్న దగ్గు మందులే ఈ మరణాలకు కారణమని తెలిపారు. 


రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో కూడా ఒక చిన్నారి మృతి చెందడంతో, జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) రంగంలోకి దిగింది. మధ్యప్రదేశ్ , రాజస్థాన్ లో హాస్పటిల్స్ లో నీళ్లు , సిరప్ , మందులుల నమూనాలు సేకరించి అంటువ్యాధుల కోణంలో కూడా పరిక్షిస్తుంది. రెండు రోజుల కాని జ్వరం , జలుబు , ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న సుమారు 1420 మంది చిన్నారులను అధికారులు ఇన్వస్టిగేషన్ కు పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజులకు మించి అనారోగ్యంతో ఉన్న పిల్లలను సివిల్ హాస్పటిల్ లో ఆరుగంటల పాటు పరిశీలనలో ఉంచుతున్నారు. పరిస్థితి విషమిస్తే జిల్లా ఆసుపత్రికి తరలించి, కోలుకున్నాక ఆశా కార్యకర్తల పర్యవేక్షణలో ఉంచుతున్నారు. మరో వైపు , ప్రైవేటు డాక్టర్లు వైద్యులు వైరల్ జ్వరాలకు చికిత్స చేయకుండా నేరుగా గవర్నమెంట్ హాస్పటిల్ కు పంపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 19 బ్యాచ్ ల దగ్గు సిరప్ ల అమ్మకాలపై బ్యాన్ విధించింది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu madhya-pradesh death

Related Articles