మీనాక్షి చౌదరి హర్యానా బేబీ. కెరియర్ లో మొదట పోలీస్ ఆఫీసర్ కావాలని అనుకున్నప్పటికీ, నటిగా మారి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఎక్కడికి వెళ్లినా ..అక్కడికే చేరాలి అన్నట్లుంది హీరోయిన్ల పరిస్థితి. అన్ని ఇండస్ట్రీల్లో కెరియర్ కు ప్లాన్ చేస్తారు...బాలీవుడ్ కు మాత్రం ఫైనల్ డెస్టినేషన్ ప్లాన్ చేస్తారు. ఇప్పటి వరకు ఎంతమంది అలా వెళ్లిపోయారో మనం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు..అప్పటి శ్రీదేవి నుంచి ఇప్పటి రష్మిక వరకు అందరూ సేమ్ దారిలో నడిచినవాళ్లే. ఇప్పుడు వీళ్లలో మరోహీరోయిన్ కలుస్తుంది. ఎవరో కాదు మీనాక్షి చౌదరి ...సంక్రాంతికి వస్తున్నాం, లక్కీ భాస్కర్ లాంటి బ్లాక్ బాస్టర్స్ ను చూసిన ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ ను రూల్ చెయ్యడానికి ప్లాన్స్ వేస్తుంది.
బేసిక్ గా ..మీనాక్షి చౌదరి హర్యానా బేబీ. కెరియర్ లో మొదట పోలీస్ ఆఫీసర్ కావాలని అనుకున్నప్పటికీ, నటిగా మారి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధించింది. తెలుగు లో తన ఫస్ట్ సినిమా " ఇచట వాహనాలు నిలపరాదు తో తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయ్యింది.
తర్వాత హిట్-2, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం తో సూపర్ డూపర్ హిట్స్ కొట్టింది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి చేతిలో " అనగనగా ఒక రాజు అనే నవీన్ పోలిశెట్టి సినిమా ఉంది. ఈ మూవీ టార్గెట్ నెక్స్ట్ సంక్రాంతి. ఇప్పుడు వీటితో పాటు బాలీవుడ్ లో జాన్ అబ్రహం హీరోగా రూపొందిన యాక్షన్-థ్రిల్లర్ సిరీస్ 'ఫోర్స్'కి సీక్వెల్ 'ఫోర్స్ 3'లో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ని సెలక్ట్ చేశారు.
ఈ మూవీకి భవ్ ధూలియా డైరక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే " ఫోర్స్ , ఫోర్స్ 2 మూవీస్ ఆడియన్స్ కు తెగ నచ్చేశాయి. అయితే ఈ సీక్వెల్ లో మీనాక్షి కూడా యాక్షన్ సీన్స్ చేస్తూ లేడీ సింగంలా కనిపించబోతుందట. ఈ క్యారక్టర్ కోసం మీనాక్షి స్పెషల్ వర్క్ షాప్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారట. అయితే బాలీవుడ్ స్పెక్ట్రం లో ఎంట్రీ ఇస్తున్న మీనాక్షి చౌదరి బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కలక్షన్లు కూడబెడుతుందో చూడాలి.