ఈ మూవీని మేకర్స్ సంక్రాంతి కానుకగా 2026 జనవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో బిజీ గా ఉన్న చిరంజీవి రీసెంట్ గా మరో పెద్ద ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మెగా స్టార్ చిరంజీవి లైన్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఆల్రెడీ వశిష్ట డైరక్షన్ లో " విశ్వంభర " లైన్ లో పెట్టారు. ఈ మూవీలో సమ్మర్ లో కూల్ గా రానుంది. మరో వైపు యంగ్ డైరక్టర్ అనిల్ రావిపూడి డైరక్షన్ లో మరో సినిమా కు సంతకాలు చేశారు. 'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభంమైంది. ఈ మూవీని మేకర్స్ సంక్రాంతి బొనాంజా లో 2026 లో రానున్నారు. అయితే ఈ మధ్య మరో భారీ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టారు. వాల్తేరు వీరయ్య సక్సస్ తర్వాత డైరక్టర్ బాబీ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు.
ఈ మూవీని మేకర్స్ సంక్రాంతి కానుకగా 2026 జనవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో బిజీ గా ఉన్న చిరంజీవి రీసెంట్ గా మరో పెద్ద ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టారు. ఈ మూవీలో స్వీటీ ని కన్ఫర్మ్ చేస్తున్నారట మూవీ టీం. చిరు 158 సినిమాలో అనుష్క తో జతకడతాడని చెబుతున్నారు. మొన్నే స్వీటీ అనుష్క ఘాటీ తో జనాల ముందుకు వచ్చినా పెద్దగా అలరించలేకపోయింది. అయితే తన నెక్స్ట్ సినిమాను దాదాపు 17 యేళ్ల తర్వాత చిరు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. అయితే అనుష్క గతంలోనే మీడియా ముందుకు వచ్చి చిరుతో యాక్ట్ చెయ్యాలని ఉందంటూ చాలా సార్లు చెప్పింది. సో ఆ కోరిక ఇప్పుడు తీరబోతుందంటున్నారు.చిరు-అనుష్క కాంబినేషన్ ఫైనల్ అయితే మెగా అభిమానులకు ఇది డబుల్ సెలబ్రేషన్ అవుతుంది. ఎందుకంటే చిరంజీవి 158వ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు సృష్టిస్తుండగా, దానికి అనుష్క జోడీ అయితే హైప్ మరింత రెట్టింపు అవుతుందనేది మూవీ టీం ఆలోచన.