Mirai : పవర్ స్టార్ మీద అభిమానంతో తన సినిమా ఆపేస్తున్న తేజసజ్జ !

నార్మల్ హీరోలు అయితే కొత్త సినిమా ఏది ఉంటే అదే అన్ని థియేటర్స్ లో వస్తాయి. మల్టీప్లెక్స్ లలో మాత్రమే వేరే సినిమాలకు స్క్రీన్స్ దొరుకుతాయి.


Published Sep 24, 2025 11:01:00 AM
postImages/2025-09-24/1758692036_miraiottrelease202509121732046914.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG మూవీ రేపే రిలీజ్ ..ఈ రోజు రాత్రి నుంచే స్పెషల్ షోలు ..సినిమా మీద ఉన్న హైప్ తో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అయిపోయాయి. అడ్వాన్స్ సేల్స్ తోనే దాదాపు 60 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. నార్మల్ హీరోలు అయితే కొత్త సినిమా ఏది ఉంటే అదే అన్ని థియేటర్స్ లో వస్తాయి. మల్టీప్లెక్స్ లలో మాత్రమే వేరే సినిమాలకు స్క్రీన్స్ దొరుకుతాయి. 


అలాంటిది పవర్ స్టార్ సినిమా ఇంత హైప్ ఉన్న సినిమా రిలీజ్ అవుతుండడంతో థియేటర్స్ , మల్టిప్లెక్స్ స్క్రీన్స్ అన్ని OG తోనే నిండిపోతాయి. ఒక్క హైదరాబాద్ లోని మొదటి రోజు 550 షోలు వేస్తున్నాయి. అవన్ని ఆల్రెడ్రీ హౌస్ ఫుల్ అయిపోయాయి. కొన్ని స్క్రీన్స్ మాత్రం గత రెండు వారాలుగా ఆడుతున్న సినిమాలు నడుస్తున్నాయి.


ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో మిరాయ్ సినిమా హీరో తేజ సజ్జ నిర్మాత విశ్వప్రసాద్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. OG రిలీజ్ సెప్టెంబర్ 25 న మిరాయ్ సినిమా ఆడే థియేటర్స్ , స్క్రీన్ అన్ని కూడా OG సినిమాకు ఇవ్వాలని నిర్మాత విశ్వప్రసాద్  డిసైడ్ అయ్యారు. దీంతో గురువారం మిరాయ్ సినిమాకు తెలుగు స్టేట్స్ లో షోలు ఆపేస్తున్నారు. మళ్లీ శుక్రవారం నుంచి సెలెక్టెడ్ స్క్రీన్స్ లో మాత్రమే మిరాయ్ సినిమా వేస్తారు.


మిరాయ్ నిర్మాత విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్ కి చాలా క్లోజ్ అది అందరికి తెలిసిందే.  తేజసజ్జా  చిన్నప్పటి నుంచి మెగా అభిమాని అని తెలిసిందే .  మెగా అభిమానిగా మిరాయ్ యూనిట్  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పవన్ ఫ్యాన్స్ మిరాయ్ టీం నిర్ణయానికి ఫిధా అవుతున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : pawankalyan newslinetelugu tejasajja mirai-movie

Related Articles