MOVIES: ప్రభాస్ మూవీ చేశాకే ..నా కెరియర్ పోయింది !

అంత మంచి కెరియర్ ను సినిమాల్లో చేస్తే ఇంకా మంచి కెరియర్ ఉంటుందనుకున్నాడట సాగర్. ఆ టైంలోనే ప్రభాస్  మూవీ లో ఆఫర్ వచ్చిందట.


Published Sep 29, 2025 08:01:00 PM
postImages/2025-09-29/1759156565_prabhas11.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రభాస్ సినిమాలో అవకాశం అంటే ఎగిరి గంతేస్తారు. ఏ ఇండస్ట్రీ లో అయినా ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం లక్ అనే ఆలోచిస్తారు . కాని మన టాలీవుడ్ ఓ హీరో మాత్రం అసలు ప్రభాస్ సినిమాలో చెయ్యకుండా ఉండాల్సిందంటున్నాడు . ఇంతకీ ఎవరా హీరో అంటారా ..టెలివిజన్ స్టార్ సాగర్ ...అదేనండి మొగలిరేకులు హీరో సాగర్ ..అసలు టెలివిజన్ లో సాగర్ ఫేమ్ అంతా ఇంత కాదు ...ఒకానొక టైంలో సాగర్ పోలీస్ గెటప్స్ చూసి పోలీసులు అయినవారు కూడా ఉన్నారంటే ఆలోచించండి. అంత మంచి కెరియర్ ను సినిమాల్లో చేస్తే ఇంకా మంచి కెరియర్ ఉంటుందనుకున్నాడట సాగర్. ఆ టైంలోనే ప్రభాస్  మూవీ లో ఆఫర్ వచ్చిందట.

అదే మిస్టర్ పర్ఫెక్ట్ అందులో ప్రభాస్ ఈక్వల్ గా సెకండ్ హీరో అన్నారట డైరక్టర్ అందుకే ఓకే చేశారట సాగర్. తీరా చూస్తే ఆ సినిమాలో ప్రభాస్ నే క్యారక్టర్ ఆర్టిస్ట్ లా వాడుకున్నారు..సినిమా అంతా కాజల్ మాత్రమే కనిపించింది. ఇక ప్రభాస్ ను కాజల్ డామినేట్ చేసేసింది ...ప్రభాస్ కనిపించడమే చాలా కష్టమైంది. ఇక సాగర్ సంగతి చెప్పక్కర్లేదు. ఈ మధ్య లవ్ 100 సినిమాతో హీరోగా థియేటర్ /కి వచ్చినా ఆడియన్స్ కు పెద్దగా ఎక్కలేదు. 


ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో సుమక్క సాగర్ ను ఓ క్వశ్చన్ అడగారు. 'అయ్యో అనవసరంగా ఆ సినిమాలో నటించానే అనేలా ఏమైనా సినిమాలు ఉన్నాయా? అని యాంకర్ సుమ ప్రశ్నించగా.. ప్రభాస్ మూవీ మిస్టర్ పర్ఫెక్ట్ అని సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ యాక్ట్ చెయ్యడం తన కెరియర్ కు ఫుల్ స్టాప్ పడిందని చెప్పడం కాస్త ఫ్యాన్స్ కు నచ్చలేదనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే కామెంట్లలో ఫ్యాన్స్ హార్ట్ అయ్యి కామెంట్లు కూడా పెట్టారు.
 

newsline-whatsapp-channel
Tags : prabhas newslinetelugu serial-artist mogals

Related Articles