Nagarjuna : నాగర్జున 100వ సినిమాలో అక్కినేని హీరోలంతా ఉంటారా !

ఇప్పుడు మాత్రం నాగార్జున తన 100 వ సినిమాకు హిట్ కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.ఇంతకీ ఎవరు డైరక్ట్ చేస్తున్నారు...ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారనేది ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ లేదు.


Published Sep 19, 2025 12:55:00 PM
postImages/2025-09-19/1758266948_nagarjunas100thmovietobearemake01.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ఇప్పటికీ భారీ చిత్రాలతో ఆడియన్స్ ను సంగతి తెలిసిందే. కొడుకులు హీరోలుగా రాణిస్తున్నా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు నాగార్జున. రానున్న సినిమా అక్కినేని ఫ్యామిలీకి చాలా స్పెషల్ . నాగార్జున 100వ సినిమా.రీసెంట్ గా అక్కినేని నాగార్జున కోలీవుడ్ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ కూలీ మూవీతో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయినా కాని రిజల్ట్ మాత్రం అంతగా వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు మాత్రం నాగార్జున తన 100 వ సినిమాకు హిట్ కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.ఇంతకీ ఎవరు డైరక్ట్ చేస్తున్నారు...ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారనేది ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ లేదు.


నాగార్జున ప్రస్తుతం పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు హోస్ట్ గా చేస్తున్నారు. సేమ్ టైంలో తన 100 వ సినిమా పై ఫుల్ ఫోకస్ చేస్తున్నారట. ఈ మూవీకి తమిళ్ డైరక్టర్ రా కార్తీక్ డైరక్ట్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో ఆయన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ టైంలో భారీ యాక్షన్ ఫిల్మ్ గా ప్లాన్ చేస్తున్నారనే గాసిప్స్ ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో నాగచైతన్య, అఖిల్ ఇద్దరు కీ రోల్ చేసే అవకాశముందట. అలా అయితే మనం మూవీ తర్వాత మరోసారి అక్కినేని ఫ్యామిలీ పిక్చర్ రెడీ అవుతున్నట్లే.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna movie-news bigboss

Related Articles