tollywood: ప్రేమించిన పాపానికి మనసు..శరీరం నలిగిపోతున్నాయి !


ఆ హీరోయిన్ మరేవరో కాదు ...నైనా గంగూలీ . పశ్చిమబెంగాల్ లోని కోల్ కత్తాకు చెందిన ఈ అమ్మడు ..చదువు పూర్తిచేసిన వెంటనే తన మకాం ను ముంబై కి మార్చింది.


Published Sep 23, 2025 11:59:00 AM
postImages/2025-09-23/1758608977_NainaGanguly.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఇండస్ట్రీ లో ప్రేమలు, పెళ్లిళ్లు ..ఎఫైర్స్ చాలా కామన్. కొందరు తన లవర్స్ ను పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం ప్రేమించి ..లవర్ చేతులో నరకం చూస్తున్నారు. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇలాంటి వారెందరో. తాజాగా ఓ హీరోయిన్ ప్రియుడి చేతుల్లో పడుతున్న బాధలు బయటపెట్టింది. 


ఆ హీరోయిన్ మరేవరో కాదు ...నైనా గంగూలీ . పశ్చిమబెంగాల్ లోని కోల్ కత్తాకు చెందిన ఈ అమ్మడు ..చదువు పూర్తిచేసిన వెంటనే తన మకాం ను ముంబై కి మార్చింది. అక్కడ మోడలింగ్ లోకి దిగిన ఈ ముద్దుగుమ్మ చాలా టాప్ బ్రాండ్స్ కు యాడ్స్ లో యాక్ట్ చేసింది.ఈ సినిమాలో అవకాశాల కోసం నైనా గంగూలీ ప్రయత్నించారు. ఫస్ట్ మేరీ భేటీ , సన్నీలియోనీ బన్ చాహ్ తీహై అనే షార్ట్ ఫిల్మ్ లో నటించారు. రీసెంట్ గా విడుదల కావడానికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి.


రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వంగవీటి చిత్రంతో తెలుగువారిని పలకరించారు నైనా గంగూలీ. ఈ మూవీలో రంగా సతీమణి వంగవీటి రత్నకుమారి పాత్రలో ఆమె నటించారు. ఫస్ట్ మూవీతోనే లుక్స్ , యాక్టింగ్ లో చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత జోహార్ మళ్లీ మొదలైంది, డేంజరస్, తగ్గేదేలే తదితర తెలుగు చిత్రాల్లో నటించినా ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. 2024 లో ప్రణయం అనే కన్నడమూవీలో చిత్రం తర్వాత నైనా గంగూలీ మరే చిత్రంలోనూ యాక్ట్ చేశారు. ఆ తర్వాత ఇక్కడా ఆమెకు పెద్దగా మూసుకుపోయాయి. అయితే తనకు ఇండస్ట్రీకు ఎలా దూరమవ్వాల్సి వచ్చిందో ఓ పోస్ట్ లో తెలిపింది. ఇప్పుడు ఈ పోస్ట్ చాలా వైరల్ అవుతుంది.


నిజానికి తప్పు ఆడపిల్లది కాదు ...తల్లితండ్రులు కూడా ప్రతి కూతురుకి సపోర్ట్ చెయ్యాలి.తను ఎంచుకున్న రంగంలో రాణించాడానికి ఆడపిల్ల ఎవరి అనుమతి తీసుకోకపోవడమే నిజమైన మహిళాసాధికారత. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన జీవితం ఇలా ఎందుకు అయిపోయిందో చెప్తూ పోస్ట్ వెయ్యడం చాలా వైరల్ అవుతుంది. తను ప్రేమించిన వాడు సరైన వాడు కాదని వాపోయింది. కోల్‌కతాకు చెందిన కొరియోగ్రాఫర్‌తో నేను కొన్నాళ్లుగా రిలేషన్‌లో ఉన్నాను.. అయితే ప్రేమిస్తున్నందుకు నాకు తగిన గుణపాఠమే జరిగింది. నా ప్రియుడి చేతిలో ఇప్పుడు శారీరకంగా  , మానసికంగా టార్చర్ అనుభవిస్తున్నా అంటూ పోస్ట్ చేసింది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu love-story socialmedia nainy-ganguly

Related Articles