NAVAPANCHAMI : నవ పంచమి యోగం తో ఈ రాశులకు తిరుగుండదు !

ఆ రోజే బుధగ్రహం , గురు గ్రహం , శుక్రగ్రహాల కలయిక ఏర్పడనుందట. దీని వల్ల ఈ మూడు రాశులు చాలా శక్తివంతంగా మారనున్నాయి.   


Published Sep 26, 2025 03:31:00 PM
postImages/2025-09-26/1758880943_394364navapanchamarajayogaeffect.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : నవపంచమ రాజయోగం వల్ల మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. దాదాపు 62 ఏళ్ల తర్వాత దసరా పండుగ టైంలో నవపంచమ రాజయోగం ఏర్పడబోతుంది. ఇది మూడు రాశుల వారికి ఆర్ధికంగా , ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను చేకూర్చనుంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున దసరా పండుగ జరుపుకుంటారు . అయితే ఆ రోజే బుధగ్రహం , గురు గ్రహం , శుక్రగ్రహాల కలయిక ఏర్పడనుందట. దీని వల్ల ఈ మూడు రాశులు చాలా శక్తివంతంగా మారనున్నాయి.   


మీన రాశి: మీన రాశి వారికి నవపంచమి రాజయోగం వల్ల ఆర్ధికంగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా చాలా బాగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఉన్న ఆర్ధిక ఇబ్బందులు , ఆరోగ్యసమస్యలు తగ్గుతాయి. ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 
వృశ్చిక రాశి : ఈ రాశివారికి పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ముఖ్యంగా నవపంచమి యోగంలో ఆర్ధిక ఇబ్బందులు తొలగడం చాలా ఈజీ. అయితే ఎవరైతే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారో వారు బయటపడి చాలా హ్యాపీగా బయటపడిపోతారు. ఆర్ధికంగా స్థిరపడతారు. అనుకోని మార్గాల నుంచి మీకు ఆదాయం వచ్చి మీ లైఫ్ సెట్ అవుతుంది.


ధనస్సు రాశి : ధనస్సురాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యాల్సివస్తుంది. ఇవి మీకు మీ కుటుంబానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. మీరు కన్న కలలు నిజం అవుతాయి. మీరు కోరుకున్న సమాజలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bhakthi

Related Articles