OG MOVIE: ఓజీ సినిమాలో అవే మైనస్ పాయింట్స్ !

ఎవరు ఏమన్నా ...బొమ్మ సూపర్ డూపర్ హిట్టు. కాని సూపర్ హిట్టు సినిమా లో కూడా చిన్న చిన్న మైనస్ లు కామనే కదా..ఇప్పుడు ఓజీ లో మైనస్ లు మాట్లాడుకుందాం.


Published Sep 25, 2025 03:36:00 PM
postImages/2025-09-25/1758794869_Tollywood20250831T160524.57520250839d1de4c4d8f1f6be7b18d128ef24ac73x2.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఇండస్ట్రీ అంతా ఓజీ మానియానే. సుజిత్ మ్యాజిక్ చేశారు. పవర్ స్టార్ డబుల్ పవర్ ఫుల్ గా చూపించాడు. గ్యాంగ్ స్టర్ గా డ్రామా మొదటి నుంచే ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు. ఎవరు ఏమన్నా ...బొమ్మ సూపర్ డూపర్ హిట్టు. కాని సూపర్ హిట్టు సినిమా లో కూడా చిన్న చిన్న మైనస్ లు కామనే కదా..ఇప్పుడు ఓజీ లో మైనస్ లు మాట్లాడుకుందాం.


సుజిత్ తీసుకున్నది చాలా డిఫరెంట్ టేకింగ్ ...పవన్ కళ్యాణ్ ను చాలా స్టైలిష్ గా చూపించారు. అయితే సినిమా కథను చాలా లాగ్ చేసి చాలా స్లో గా తీసుకొచ్చారు. మే బీ స్టోరీ జనాల్లోకి మెల్లగా ఎక్కించాలనో ఏమో కొంచం డ్రాగ్ చేస్తున్నట్లు అనిపించింది.


* ఇక సెకండ్ పాయింట్ ముఖ్యంగా మొదటి భాగంలో చాలా సేపు పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం ప్రేక్షకులకు కొంత బోర్  కొట్టించేస్తుంది 


* ఇక థర్డ్ పాయింట్ ఇంటర్వెల్ తర్వాత హై మూమెంట్స్ సరిగ్గా పండకపోవడం సెకండాఫ్ స్టార్ట్ అయిన 20 నిమిషాల తర్వాత ఈ చిన్న నిరాశ ఫ్యాన్స్ కు కలగొచ్చు.


* శ్రేయా రెడ్డి లాంటి బెస్ట్ యాక్టర్ ను సుజిత్ సరిగ్గా వాడుకోలేదని అనిపిస్తుంది. ఆమెను ట్రైలర్ లో లేడీ టైగర్ లా చూపించి తీరా సినిమా లోకి వచ్చేసరికి అంత ఇంపాక్ట్ ఏం లేదనిపించింది. ఇలాంటివి ఏమున్నా సినిమా సూపరే కాని చిన్న చిన్న పాయింట్స్. ఇవి కూడా సుజిత్ పట్టించుకుని ఉంటే ...ఇంకా బ్లాక్ బాస్టర్ లా అనిపించేది . ఏది ఏమైనా కలక్షన్లు వచ్చేస్తాయి అది మాత్రం పక్కా.
 

newsline-whatsapp-channel
Tags : pawankalyan newslinetelugu movie-news

Related Articles