OG MOVIE: ఓజీ మూవీ హీరోయిన్ ప్రియాంక మోహన్ రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా !

ఈ మూవీతో ప్రియాంక మోహన్ కు మంచి కెరియర్ ఉంటుందంటున్నారు సినీ వర్గాలు. అందులోను అమ్మడు కూడా క్లీన్ బ్యాక్ గ్రౌండ్ తో ఎక్స్ పోజింగ్ కు నో చెబుతూ మంచి సౌత్ ఇండియాన్ అమ్మాయిగా పర్ఫెక్ట్ గా ఉంటుంది.


Published Sep 23, 2025 01:33:00 PM
postImages/2025-09-23/1758614676_OGmovieheroinePriyankaMohancommentsaboutPawanKalyan1024x576.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రియాంక మోహన్ ప్రజెంట్ క్రేజీ హీరోయిన్ ...ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో OG మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీతో ప్రియాంక మోహన్ కు మంచి కెరియర్ ఉంటుందంటున్నారు సినీ వర్గాలు. అందులోను అమ్మడు కూడా క్లీన్ బ్యాక్ గ్రౌండ్ తో ఎక్స్ పోజింగ్ కు నో చెబుతూ మంచి సౌత్ ఇండియాన్ అమ్మాయిగా పర్ఫెక్ట్ గా ఉంటుంది.


ప్రియాంక అరుళ్ మోహన్ టాలీవుడ్ ఆడియన్స్ కు , సౌత్ ఆడియెన్స్ లో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్వాలిటీనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని సంపాదించి పెట్టింది. పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నతమైన పదవీలో ఉన్నారు. దీంతో ఆయన నుంచి వచ్చే సినిమా ఎక్కడా నెగిటివ్ కామెంట్ రాకూడదని సినిమా పై చాలా కాన్సంట్రేషన్ చేస్తున్నారు.


అయితే, ప్రియాంక మోహన్ కు OG చిత్రంలో మెయిన్ లీడ్ హీరోయిన్ గా నటించినందుకు పారితోషికం కేవలం రూ.40 లక్షలు  ప్రమోషన్స్ కి మాత్రమేనట. మెయిన్ రెమ్యూనిరేషన్  1.25 పారితోషికాన్ని అందుకున్నారని సినీ వర్గాల్లో టాక్. దీంతో ప్రియాంక మోహన్ క్యారక్టర్ సినిమాలో ఎంత ఉంటుందనేది డౌటే. ఎందుకంటే ఫుల్ గా యాక్షన్ సినిమా లో హీరోయిన్ క్యారక్టర్ కాస్త తక్కువ ఉండే అవకాశం ఉందంటున్నారు సినీవర్గాలు.డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీకి భారీ ప్రమోషన్స్ ..ట్రైలర్స్ రివ్యూస్ తో దుమ్ము లేపుతున్నారు. 25 వతేదీ రిలీజ్ కు రెడీ అవుతుంది.
 

newsline-whatsapp-channel
Tags : pawankalyan newslinetelugu priyanka-mohan remuniration

Related Articles