ఫస్ట్ ఓజీ సినిమా సినిమా కాదు, ఒక ఫ్యాన్ బాయ్ ట్రీట్. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పర్ఫెక్ట్ విజువల్ ట్రీట్ . ఒక రాజుకి అతని యోధుడు దూరమైపోతాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ కు గోల్డెన్ డేస్ నడుస్తున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ కు ఓజీ మరో హిట్టు రిసీవ్ చేసుకుంది. పవన్ కళ్యాణ్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో సేమ్ టు సేమ్ అలానే సినిమా లో కనిపించడంతో మాస్ జాతర మొదలైంది. థియేటర్ ఫ్యాన్స్ ఒకటే విజిల్స్ , పేపర్లు సినిమా సూపర్ డూపర్ బ్లాస్టే . డైరక్టర్ సుజిత్ కు ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారంటే చూడండి సినిమా ఏ రేంజ్ లో ఉందో ఇంకెందకు లేట్ రివ్యూ చూసేద్దాం.
ఫస్ట్ ఓజీ సినిమా సినిమా కాదు, ఒక ఫ్యాన్ బాయ్ ట్రీట్. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పర్ఫెక్ట్ విజువల్ ట్రీట్ . ఒక రాజుకి అతని యోధుడు దూరమైపోతాడు. ఇలాంటి టైంలో శత్రువులు పై పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. ప్రజలు చాలా కష్టాలు పడుతుంటారు. ఆ కష్టాలు చూడలేక మళ్లీ యోధుడు తిరిగి వస్తాడు. ఇక్కడ రాజు సత్య దాదా అయితే, యోధుడే ఓజాస్ గంభీర అలియాస్ OG. అతని గతమే ఈ సినిమాకు బ్యాక్ బోన్ . ఓమి లాంటి చాలా క్రూరమైన శత్రువులను OG ఎలా ఎదుర్కొన్నాడు అనేదే సినిమా . జపాన్ లో సమరాయ్ వంశంతో OG కి ఉన్న లింక్ ఏంటి ..ముంబై అండర్ వరల్డ్ లో అతని పాత్ర ఏంటి అనేది డైరక్టర్ సుజిత్ చాలా ఇంట్రస్టింగ్ గా తీశారు.
సుజీత్ పర్ఫెక్ట్ గా ఈ సినిమాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా క్రియేట్ చేసినట్లు చేశాడు. ప్రతి సీన్ , ప్రతి యాక్షన్ సీక్వెన్స్ పవన్ స్టైల్ ను మరింత పెంచేలా డిజైన్ చేశారు. థమన్ మ్యూజిక్ కూడా ఏదో పూనకం వచ్చి కొట్టినట్లు కొట్టాడు. సినిమా స్టార్టింగ్ లో వచ్చే యకుజా , సమరాయ్ స్టోరీ ఆడియన్స్ ను మరో వరల్డ్ కు తీసుకెళ్తాయి. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచి ఎలివేషన్స్ ..పోలీస్ స్టేషన్ లో ఎలివేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ . అయితే తండ్రి కొడుకుల మధ్య ప్రేమ..గర్ల్ ఫ్రెండ్ ఎమోషన్స్ పెద్దగా వర్కవుట్ కాలేకపోయినా యాక్షన్ సీన్స్ తో అవన్నీ డామినేట్ చేసేశారు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ ఎప్పుడు కనిపించనంత స్టైలిష్ గా కనిపించాడు. సుజిత్ తీసిన యాక్షన్ సీన్స్ కు థమన్ మ్యూజిక్ హార్ట్ అనే చెప్పాలి. కొంచెం జానీ స్టైల్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కు ఖుషీ సినిమా ఎలాగో ఈ సినిమా మళ్లీ అలా అవుతుంది.