RAJASAAB TRAILER: ప్రభాస్ " రాజాసాబ్ " టైలర్ అవుట్ !

ఫస్ట్ టైం ప్రభాస్ తో హారర్ కామెడీ చేయిస్తున్నాడు మారుతి . కేవలం ఈ ప్రభాస్ విత్ కామెడీ కాంబినేషన్ చూడ్డానికే ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.


Published Sep 29, 2025 08:33:00 PM
postImages/2025-09-29/1759158322_rajasaab21759055720.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ రోజు పండగే. చాలా రోజుల నుంచి ఊరిస్తున్న ప్రభాస్ రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ టీం. ప్రభాస్ హీరోగా మారుతీ డైరక్షన్ లో వస్తున్న మూవీ " రాజాసాబ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్ , రిధి కుమార్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఫస్ట్ టైం ప్రభాస్ తో హారర్ కామెడీ చేయిస్తున్నాడు మారుతి . కేవలం ఈ ప్రభాస్ విత్ కామెడీ కాంబినేషన్ చూడ్డానికే ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.


రీసెంట్ డేస్ లో రాజాసాబ్ మూవీ టీజర్ రిలీజ్ చేసి కాస్త సినిమా మీద బజ్ క్రియేట్ చేశారు. ఈ రోజు ట్రైలర్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. అయితే ఈ మూవీని సంక్రాంతి కి లాక్ చేశారు. ఈ సారి పండుగ మామూలుగా ఉండకూడదంటున్నారు మూవీ టీం. అందుకే ఈ సినిమా జనవరి 9 కి రిలీజ్ చేస్తున్నట్లు ట్రైలర్ తో అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.


ఇంతకీ ట్రైలర్ లో ఏముందంటే ప్రభాస్ ఓ పాత బంగ్లాకు వెళ్తాడు ..అక్కడ దయ్యం రావడం మధ్య లో కాస్త కామెడీ గా హీరోయిన్స్ తో లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు చూపించారు. తర్వాత అక్కడ దయ్యం రావడం మధ్యలో ప్రభాస్ లోకి దయ్యం ఆవహిస్తుంది. చివర్లో.. ఏందిరా మీ బాధ పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేనేమన్నా చీమనా.. రాక్షసుడిని అంటూ ట్రైలర్ తో సినిమా పై బజ్ క్రియేట్ చేశారు మారుతి. అయితే సినిమా రిలీజ్ కు ఇంకా మూడు నెలలు ఉండగానే ట్రైలర్ రిలీజ్ చెయ్యడం కొంచెం ఎక్కడో కొడుతుంది . ఇంకా ఆలోచిస్తే నెక్స్ట్ ప్రభాస్ హ్యాపీ బర్త్ డే ఉంది అప్పుడు చేస్తే బాగుండేది అనేది ఫ్యాన్స్ అభిప్రాయం . అయితే ఇప్పటికే సినిమా ఘూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్నారు మూవీ టీం. ఏది ఏమైనా ఫ్యాన్స్ కు బూస్ట్ ఇచ్చేలా ప్రభాస్ టీజర్ రిలీజ్ అయ్యింది అది చాలు.


 

newsline-whatsapp-channel
Tags : prabhas newslinetelugu maruthi rajasab

Related Articles