కాంగ్రెస్, బీఆర్ఎస్, మహాత్మా గాంధీని ప్రస్తావిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సడన్ గా రాహుల్ రామకృష్ణ లో ఈ యాంగిల్ ఎవ్వరూ ఎక్స్ పర్ట్ చెయ్యలేదు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ యాక్టర్ ..స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ సంచలన ట్వీట్ చేశారు. సినిమాల్లో కామెడీ పంచుతూ సడన్ గా స్టేట్ పాలిటిక్స్ పై తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామంపై చాలా స్టైయిట్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మహాత్మా గాంధీని ప్రస్తావిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సడన్ గా రాహుల్ రామకృష్ణ లో ఈ యాంగిల్ ఎవ్వరూ ఎక్స్ పర్ట్ చెయ్యలేదు.
ఇంతకీ ఆయన ట్వీట్ లో ఉద్దేశ్యం ఏంటంటే...ప్రస్తుతం మనం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. డబుల్ డోర్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నా అంటూ కేటీ ఆర్ ను ట్యాగ్ చేశాడు. అలాగే.. నేను విసిగిపోయాను, నన్ను చంపేయండి, హైదరాబాద్ మునిగిపోయింది, హామీలన్నీ విఫలమయ్యాయి, ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్” ను ట్యాగ్ చేశాడు. పోనీ అంతటితో ఆగాడా లేదు ...“గాంధీ ఏం మహాత్ముడు కాదంటూ సోషల్ మీడియాలో మరో ట్వీట్ చేసి షాకిచ్చాడు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున రాహుల్ ఇలా పోస్ట్ చెయ్యడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ పోస్టులు పెట్టిన కొన్ని గంటల్లోనే రాహుల్ తన ఎక్స్ ఖాతాను డిలీట్ చేయడం విశేషం. అయితే, రాహుల్ రామకృష్ణ ఎందుకు ఎలాంటి పోస్టులు పెట్టాడు? ఎందుకు డిలీట్ చేశాడంటూ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.