మోహన్ లాల్ కు ఈ అవార్డు దక్కడం పై సినీ ప్రముఖలంతా అన్ని ఇండస్ట్రీ ల నుంచి అభినందనలు తెలిపారు. అయితే ఈ విషయం రామ్ గోపాల్ వర్మ కు మాత్రం నచ్చలేదనుకుంట. ఓ విచిత్రమైన ట్వీట్ వేశాడు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కాంట్రవర్సీనే . మహానుభావుడు పుట్టడమే ..కాంట్రవర్మీల కోసం పుట్టినట్లున్నాడు. అయితే లేటెస్ట్ గా ఏకంగా ఇండియన్ ఫిల్మ్ం మేకర్ నే అవమానించే పనిలో పడ్డాడు రామ్ గోపాల్ వర్మ. రీసెంట్ గా మాలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు దేశంలోనే అత్యున్నత సినీ పురస్కారం లభించిన విషయం తెలిసిందే. సినిమా రంగానికి ఆయన సేవలు గుర్తిస్తూ భారత ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేశారు. మోహన్ లాల్ కు ఈ అవార్డు దక్కడం పై సినీ ప్రముఖలంతా అన్ని ఇండస్ట్రీ ల నుంచి అభినందనలు తెలిపారు. అయితే ఈ విషయం రామ్ గోపాల్ వర్మ కు మాత్రం నచ్చలేదనుకుంట. ఓ విచిత్రమైన ట్వీట్ వేశాడు
ఏకంగా రాంగోపాల్ వర్మ రాష్ట్ర ద్రౌపది ముర్ము గురించి కూడా కామెంట్ చెయ్యడం ఫుల్ వైరల్ అవుతుంది. మొన్నే చంద్రబాబు. లోకేష్ పై ట్వీట్లు వేసి కేసులు వేయించుకున్నాడు. అయినా ఇంకా వివాదాల్లో వేళ్లు పెడుతున్నారు రామ్ గోపాల్ వర్మ. దాదా సాబ్ ఫాల్కేపై మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. దాదాసాబ్ ఫాల్కే ఎవరో నాకు పూర్తిగా తెలీదు. ఆయన మొదటి సినిమా తీశారని తెలుసు ...నేను ఆయనను చూడలేదు..ఆయన్ని చూసిన వారిని నేను కలవలేదు. చనిపోయాడనే ఒక్క క్వాలిఫికేషన్ తప్ప మరేది లేదు.
వాళ్లు పోయినోళ్లందరి కంటే.. చాలా గ్రేటర్. పోవడం అదనపు క్వాలిఫికేషన్ కాదు. అది అచీవ్‌మెంట్ కూడా కాదు. పోయినోళ్ల పేరు మీద బతికి ఉన్న గొప్పవాళ్లకు అలాంటి అవార్డులు ఇవ్వడం చాలా తప్పుపని. బతికి ఉన్న వాళ్లు, మరణించిన వాళ్లను మధ్య చూపిస్తున్న వివక్ష అదే అని ఆర్జీవి మరో ట్వీట్ చేశాడు. దీనిపై మూవీ లవర్స్ తెగ ఫైర్ అవుతున్నారు.. ఏం వర్మ సార్ తాగి ట్వీట్ చేశారా ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.