ట్వీట్లు వెయ్యడంలో రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ ..బాగుందంటే బాగుంది లేదంటే లేదు ..మొహం మీదే కుండ బద్దలుకొట్టేస్తాడు .. అలాంటి రామ్ గోపాల్ వర్మ ప్రభాస్ ట్రైలర్ ను చూసి చాలా బాగుదని ట్వీట్ వేశారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : డార్లింగ్ ప్రభాస్ కమింగ్ మూవీ " రాజాసాబ్ " అసలు ప్రభాస్ ను ఓ డిఫరెంట్ కామిక్ యాంగిల్ లో చూడడానికి ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. మారుతి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ పై రామ్ గోపాల్ వర్మ తన ఓపీనియన్ ను పంచుకున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ లోని ఓ డిఫరెంట్ యాంగిల్ ను చూశానంటూ మారుతి కి తెగ పొగిడేశారు.
ట్వీట్లు వెయ్యడంలో రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ ..బాగుందంటే బాగుంది లేదంటే లేదు ..మొహం మీదే కుండ బద్దలుకొట్టేస్తాడు .. అలాంటి రామ్ గోపాల్ వర్మ ప్రభాస్ ట్రైలర్ ను చూసి చాలా బాగుదని ట్వీట్ వేశారు "చాలా ఏళ్లుగా ప్రభాస్‌లోని తీవ్రమైన కోణాన్నే చూస్తున్నాం. కానీ, 'ది రాజా సాబ్' పోస్టర్ చూస్తుంటే ఇది కేవలం ఇంటెన్స్ లేదా ఛార్మ్ మాత్రమే కాదు, ప్రభాస్‌లోని ఓ డిఫరెంట్ యాంగిల్ చూపించబోతున్నారని కాంప్లిమెంట్ ఇచ్చారు.
రామ్ గోపాల్ వర్మ ప్రశంసలపై డైరక్టర్ మారుతి చాలా ఎమోషనల్ అయ్యారు. కెరీర్ స్టార్టింగ్ లో తనకు సినిమాలు నచ్చడానికి వర్మ ప్రభావం తన పై చాలా ఉందని తెలిపారు. మీ " దొంగల ముఠా " సినిమా చూసి ఓ చిన్న 5 డి కెమరాతో " ఈ రోజుల్లో " సినిమా తీశాను. నా ఫస్ట్ సినిమా టైటిల్స్ ను మీకు థాంక్యూ చెప్పాను. మీరు నాకు ఇలా కంగ్రాట్యులేషన్స్ చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందంటూ రిప్లై ఇచ్చాడు. ఇన్నేళ్ల ఇండస్ట్రీ జర్నీలో మీరు నాకు స్పెషల్ గా ఇలా కంప్లిమెంట్స్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీ గా ఉందంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి రాజాసాబ్ ట్రైలర్ ...రామ్ సాబ్ కు నచ్చిందనమాట. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ డార్లింగ్ ఫ్యాన్స్ కు అంచనాలు పెంచేసింది.