'నిజం' సినిమా కోసం నన్ను తేజ గారు ఆఫీసుకి పిలిపించి మాట్లాడారు. నాక్యారక్టర్ డీటైల్స్ చెప్పి కాస్త స్లిమ్ అవ్వాలని చెప్పారు. ట్రైనర్ ని ఇచ్చి విత్ అవుట్ మేకప్ సినిమా చెయ్యాలని కోరారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: 90 s లో ఇండస్ట్రీ ని షేక్ చేసిన హీరోయిన్స్ లో రాశి కూడా ఒకరు...పధ్ధతిగా ..స్టైలిష్ అందంగా భలే ఉండేవారు . చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి హీరోయిన్ గా టాప్ లో ఉన్నారు. శుభాకాంక్షలు .. గోకులంలో సీత .. స్నేహతులు లాంటి సినిమాలు రాశిని నెంబర్ వన్ హీరోయిన్ గా నడిపించాయి. అంత క్రేజ్ ఉన్న హీరోయిన్ కెరియర్ సడన్ గా ఎందుకు స్టాప్ అయ్యిందనేది ఆవిడ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. షాకింగ్ విషయం ఏంటంటే మహేష్ బాబు సినిమా చెయ్యడం వల్ల తన కెరియర్ పోయిందని తెలిపారు.
'నిజం' సినిమా కోసం నన్ను తేజ గారు ఆఫీసుకి పిలిపించి మాట్లాడారు. నాక్యారక్టర్ డీటైల్స్ చెప్పి కాస్త స్లిమ్ అవ్వాలని చెప్పారు. ట్రైనర్ ని ఇచ్చి విత్ అవుట్ మేకప్ సినిమా చెయ్యాలని కోరారు. ఫస్ట్ రోజే నాతో కాస్త అడల్ట్రీ సీన్స్ తీసేశారు. ఇక నేను సినిమా నుంచి ఎక్సేప్ అవ్వకుండా చేశారు. ఈ సీన్ గురించి నాకు ముందుగా చెప్పలేదు గనుక నేను చేయనని చెప్పాను. అయినా కాని బాబురావు చెప్పడం తో ఇష్టం లేకుండా చేశాను. కాని తేజగారు నాకు చాలాసార్లు సారీ చెప్పినా నేను దానిని తీసుకోలేకపోయాను.
అలాంటి క్యారక్టర్ చేస్తే నా కెరియర్ కు దెబ్బ అని నాకు అనిపించినా చేశారట. తన ఫ్యాన్స్ ఫీలవుతారనే విషయం ఆలోచించారట కాని ఇలా కెరియరే లేకుండా అయిపోతుందని అవకాశాలే రాకుండా అవుతుందని అనుకోలేదట. ఏది ఏమైనా ఇక ఆ సినిమా తో నా సినిమా కెరియర్ కు ఫుల్ స్టాప్ పడిపోయింది. నా కెరియర్ లో ఏ డైరక్టర్ నైనా మరిచిపోవల్సి వస్తే నేను తేజ పేరు చెప్తానంటు కాస్త గరం అవుతూనే చెప్పారు రాశి.