rhea chakraborthy : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రియాకు బిగ్ రిలీఫ్ !

ఈ కేసుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఫస్ట్ అంతా డిప్రెషన్ తో చనిపోయారనుకున్నారు. కాని రోజుల తర్వాత తన ఫ్యామిలీ ప్రమేయంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. చాలా లాంగ్ ఇన్వస్టిగేషన్ తర్వాత రియా చక్రవర్తి కి సుశాంత్ మరణంతో సంబంధం లేదని ...ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది.


Published Oct 01, 2025 11:08:00 AM
postImages/2025-10-01/1759297162_pjimage132022061408431820220614093809.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బాలీవుడ్ యాక్టర్ రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది బాంబే హైకోర్టు. 2020 జూన్‌లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన ఇంట్లో సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఈ కేసుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఫస్ట్ అంతా డిప్రెషన్ తో చనిపోయారనుకున్నారు. కాని రోజుల తర్వాత తన ఫ్యామిలీ ప్రమేయంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. చాలా లాంగ్ ఇన్వస్టిగేషన్ తర్వాత రియా చక్రవర్తి కి సుశాంత్ మరణంతో సంబంధం లేదని ...ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది.


బాలీవుడ్ యాక్టర్ రియా చక్రవర్తికి బాంబే హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి సంబంధించిన కేసులో ఆమెకు విధించిన బెయిల్ షరతులను కోర్టు పర్మినెంట్ గా క్యాన్సిల్ చేసింది. ఆమె పాస్‌పోర్ట్‌ను వెంటనే తిరిగి ఇవ్వాలని నార్కోటిక్స్ కంట్రోల్ ను బుధవారం ఆదేశించింది.


సుశాంత్ కేసులో గతంలో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి నెల రోజుల తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. అయితే తన పాస్ పోర్ట్ ను ఎన్ సీబీకి అప్పగించాలనే షరతును ఆమెపై విధించారు. ఈ షరతు కారణంగా తాను విదేశాల్లో వచ్చే చాలా అవకాశాలు కోల్పోతున్నాని తెలిపారు. దయచేసి తన కెరియర్ ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరడంతో బొంబై కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. 


ఈ అభ్యర్థనను ఎన్‌సీబీ తరఫు న్యాయవాది ఎస్‌కే హల్వాసియా తీవ్రంగా వ్యతిరేకించారు. రియాను కూడా సాధారణ పౌరురాలిగానే చూడాలని, కేవలం ఆమె సెలబ్రిటీ అయినంత మాత్రాన నిబంధనలలో ప్రత్యేక మినహాయింపులు ఇవ్వకూడదని వాదించారు. రెండు వైపుల వాదనలు విన్న జస్టిస్ గోఖలే రియాకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. "విచారణ ముగింపునకు ఆమె అందుబాటులో ఉండరని సందేహించడానికి ఎలాంటి కారణం లేదు" అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇన్వెస్టిగేషన్ కు ఆమె పూర్తిగా హెల్ప్ చేస్తున్నారు ..సపోర్ట్ చేస్తున్నారు. గతంలో అనుమతితో విదేశాలకు వెళ్లి సకాలంలో తిరిగి వచ్చారని కోర్టు గుర్తుచేసింది. ఇదే కేసులోని ఇతర నిందితులకు కూడా ఇాలాంటి ఊరట లభించిందని ధర్మాసనం పేర్కొంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu criminal-case sucide sushanth-singh-rajputh

Related Articles