SAMANTHA: బాయ్ ఫ్రెండ్ తో జిమ్ కొచ్చిన సమంత !

రాజ్ నిడిమోరుతో ఈ మధ్య కాలంలో చాలా క్లోజ్ గా ఉన్నారు  . దీంతో మీడియా తో పాటు పబ్లిక్ కూడా సమంత కు ఓ తోడు దొరికిందంటున్నారు.


Published Sep 24, 2025 01:29:00 PM
postImages/2025-09-24/1758700810_20250923200613etbnr.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా సినిమాల కంటే పర్సనల్ లైఫ్ తోనే వార్తల్లోకి వస్తుంది. ముఖ్యంగా బీటౌన్ డైరక్టర్ రాజ్ నిడిమోరుతో ఎక్కువ కనిపిస్తుంది. అయితే సేమ్ కారులో జిమ్ కి వెళ్లొస్తూ ఈ జంట మీడియా కంట పడ్డారు. దీనిలో ఏముంది అంటారేమో ఈ విషయంపై సమంత కాని రాజ్ కాని తమ మధ్య ఏముందో క్లారిటీ ఇవ్వలేదు. రాజ్ నిడిమోరుతో ఈ మధ్య కాలంలో చాలా క్లోజ్ గా ఉన్నారు  . దీంతో మీడియా తో పాటు పబ్లిక్ కూడా సమంత కు ఓ తోడు దొరికిందంటున్నారు.


చైతన్య , శోభితను చేసుకున్న తర్వాత సమంత మానసికంగా చాలా కుంగిపోయారు. విడాకుల తర్వాత తన హెల్త్ ప్రాబ్లమ్స్ ..ఈ విడాకులు ఆమెను చాలా బాధపెట్టాయి. దీని నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఫైనల్ గా ఇప్పుడు రాజ్ తో మంచి ఫ్రెండ్షిప్ లేదా రిలేషన్ షిప్ ఏదైనా కాని సంతోషంగా కనిపిస్తుందంటున్నారు పబ్లిక్. డైరక్టర్ రాజ్ తో  ది ఫ్యామిలీ మెన్, సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లు చేశారు. ఆ స్నేహమో..నిజంగా రిలేషన్ షిప్పో తెలీదు కాని వీళ్లిద్దరు ఈ మధ్య చాలా ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు. 


రాజ్ తో కలిసి పికెల్ బాల్ ఆడటంతో పాటు సీక్రెట్‌గా పార్టీలు, వెకేషన్స్‌తో రాజ్- సమంతలు చక్కర్లు కొట్టడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం అమెరికాలోని డెట్రాయిట్‌ వీధుల్లో సమంత - రాజ్ కనిపించారు.  సమంత- రాజ్‌లు జంటగా ఒకే కారులో వెళ్లిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. సమంత రాజ్ చేతులు పట్టుకొని పిక్ ను పోస్ట్ చెయ్యడం కూడా రూమర్స్ కు మరింత స్రెంథ్ ఇస్తుంది.


సమంత రీసెంట్ గా శుభం సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా ఇద్దరూ ఒకే విమానంలో జర్నీ చేశారు. ఈ టైంలో రాజ్ భుజాలపై సమంత తలపెట్టుకుని పడుకున్నారు. ఆ తర్వాత ఆయనతో కలిసి తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయాలను సమంత దర్శించుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే రాజ్ ను సమంత రిలేషన్ లో ఉన్నారని అంటున్నారు సినీ వర్గాలు. అలా అయితే సమంత కు తోడు దొరికినట్లే.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu samatha love-story mumbai

Related Articles