SAMANTHA: ఆ టైంలో నాకు ఎవరూ ప్రేమ గురించి చెప్పలేదు ..చెప్తుంటే బాగుండేది !

అది రాజ్ తో రిలేషనా లేక మంచి ఫ్రెండ్సా అనేది తెలీదు కాని ...మళ్లీ హ్యాపీ సామ్ ను చూస్తున్నాం. అయితే ఇప్పుడు సామ్ సోషల్ మీడియా పోస్ట్ సామ్ ఫ్యాన్స్ ను ఎమోషనల్ ఫీల్ అయ్యేలా చేస్తున్నాయి.


Published Sep 29, 2025 02:51:31 PM
postImages/2025-09-29/1759137691_cr20250505681845ba21603.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్:  సమంత తెలియని వాళ్లు ఎవరున్నారు.విడాకులు తీసుకున్నాక ఇంకా బాగా జనాల్లో ఆదరణ పొందింది. కారణం ఏదైనా కాని సమంత చైతన్యను ప్రేమించింది. విడిపోయాక చాలా ఇబ్బందులు కూడా పడింది. ఆ తర్వాత పర్సనల్ లైఫ్ లో ఆరోగ్యసమస్యలతో చాలా నలిగిపోయింది. అయితే రీసెంట్ గా సామ్ ఫేస్ లో మళ్లీ హ్యాపీ ఛార్మింగ్ కనిపిస్తుంది. అది రాజ్ తో రిలేషనా లేక మంచి ఫ్రెండ్సా అనేది తెలీదు కాని ...మళ్లీ హ్యాపీ సామ్ ను చూస్తున్నాం. అయితే ఇప్పుడు సామ్ సోషల్ మీడియా పోస్ట్ సామ్ ఫ్యాన్స్ ను ఎమోషనల్ ఫీల్ అయ్యేలా చేస్తున్నాయి.


“రీసెంట్ గా నేను, నా మేకప్‌ ఆర్టిస్ట్‌ ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఎంత ఆశ్చర్యమనిపించిందో...జీవితం ముప్పై ఏళ్ల లో ఒకలా...ఇరవైల్లో ఒకలా కనిపిస్తుంది. అందుకే జీవితాన్ని ఇరవైలలో అనుభవించాలి. ముప్పైల్లో జీవితం అంతా బాధ్యతలతో నిండిపోతుంది. నేను నా ఇరవైలలో నేమ్ ఫేమ్ కోసం పరుగులు తీశాను. ఇప్పుడు నాకు లైఫ్ పై క్లారిటీ వచ్చింది. పాత విషయాలు మొయ్యడం మానేశాను..కాని నా జీవితాన్ని నేను చాలా కోల్పోయానని చెప్పడం సమంత ఫ్యాన్స్ కు చాలా బాధేసింది.


నిజానికి ఆ ఇరవైలలో లైఫ్ ని ప్రేమించమని నాకు ఎవరూ చెప్పలేదు. నిజంగా ప్రేమలో ఉండడం అంటే ..మనల్ని మనం ప్రేమించుకోవాలి. నా మేకప్ ఆర్టిస్ట్ తో మాట్లాడాక నాకు ఈవిషయం మరింత బాగా అర్ధమయ్యిందంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది సామ్. ప్రతి అమ్మాయిని ఉద్దేశించి సామ్ ఓ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. గర్ల్స్ మీలా మీరు ఉండండి ...ఎందుకంటే, మీరు మీలా ఉన్నప్పుడు మాత్రమే గర్వంగా, ధైర్యంగా, ఆనందంగా ఉంటారు” అంటూ పోస్ట్ చేసింది సమంత. ఈపోస్ట్ పై సామ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news samantha social-media

Related Articles