Rajanna : పదిరోజుల క్రితం చనిపోయిన అమ్మాయి ..పదోతరగతి పరీక్షల్లో స్కూల్ టాపర్ !

మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన పరీక్షలకు పూర్తయిన 13 రోజులకు ఆమె చాలా అనారోగ్యానికి గురై చనిపోయింది


Published May 01, 2025 12:55:00 PM
postImages/2025-05-01/1746085119_cr20250501tn6813177a85583.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టెన్త్ ఎగ్జామ్స్ రిలీజ్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఓ బాలిక స్కూల్ టాపర్ గా నిలిచింది. కష్టపడి చదివింది. తన భవిష్యత్తు ఎంతో అందంగా ఉంటుందని ఊహించుకుంది, కాని దేవుడు వేసిన ప్లాన్ వేరే ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల రవి , రజిత దంపతుల కూతురు నాగచైతన్య అదే ఊరికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన పరీక్షలకు పూర్తయిన 13 రోజులకు ఆమె చాలా అనారోగ్యానికి గురై చనిపోయింది.అయితే, బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఆమె 600 మార్కుల‌కు గాను 510 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్‌గా నిలిచింది. కానీ, ఆ సంతోషాన్ని పంచుకునేందుకు కూతురే లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలావిసెల రోదిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu government-schools topnews died

Related Articles