JACK: " జాక్ " డిజాస్టర్ తర్వాత డిస్టిబ్యూటర్స్ కి డబ్బులిచ్చేశాడట !


సిధ్ధు లాస్ట్ సినిమా " జాక్ " బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 10 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.


Published Sep 26, 2025 04:38:00 PM
postImages/2025-09-26/1758885135_1924325untitleddesign.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : డీజే టిల్లు సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.  హీరో సిద్దు జొన్నల గడ్డ టిల్లు సినిమా ఫుల్ సూపర్ డూపర్ హిట్ట్...ఆ తర్వాత 'తెలుసు కదా' తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ మూవీ అక్టోబర్ 17 రిలీజ్ కానుంది. అయితే సిద్ధూ చెప్పిన కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


సిధ్ధు లాస్ట్ సినిమా " జాక్ " బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 10 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రేక్షకులు అంచనాలు అందుకోవడంలో ఈ సినిమా ఫెయిల్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా రెమ్యూనిరేషన్ ను ప్రొడ్యూసర్లకు రిటర్న్ ఇచ్చినట్లు సిద్దు తాజాగా ఇంటర్యూలో చెప్పారు.


నా లాస్ట్ చేసిన సినిమా జాక్ . ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. అయితే నా వల్ల ఎవరు కూడా నష్టపోకూడదనే నేను కోరుకుంటాను. అందుకే నా రెమ్యూనిరేషన్ రూ. 4.75 కోట్లు మేకర్స్ కు వాపస్ ఇచ్చేశాను. అయితే ఈ డబ్బు రిటర్న్ ఇచ్చేందుకు నేను లోన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అప్పును వీలైనంత త్వరగా తీర్చేయడం పైనే నా దృష్టి ఉంది అని సిద్దు అన్నారు. అయితే రెమ్యూనిరేషన్ వాపసు ఇవ్వడం ఈ రోజుల్లో ఇండస్ట్రీ లో కొత్తేం కాదు. డబ్బులు లేకపోయినా ..లోన్ తీసుకొని మరీ మేకర్స్ కు ఇవ్వడం అనేది సిధ్దు విశేషం . తన మీద నమ్మకం పెట్టుకున్నవారు నష్టపోవడం నాకు చాలా కష్టంగా ఉంటుంది. నా వల్లే ఏ నిర్మాత నష్టపోకూడదు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news siddu-jonnalagadda

Related Articles