బ్యాన్ చేసిన బెట్టింగ్ యాప్స్ ను సోనూ సూద్ ప్రమోట్ చేశారనే కేసు విచారణకు రావడంతో హాజరయ్యారు. చాలా సార్లు సమన్లు పంపినా హాజరుకాలేదు సోనూసూద్ . ఈ సారి విచారణకు హాజరయ్యారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం టోటల్ భారత్ సినీ , సోషల్ మీడియా ఇండస్ట్రీలంతటిని కుదిపి పారేసింది. చిన్న చేపలు ..పెద్ద చేపలు వలలో పడినట్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారందరిపై కేసులు పడ్డాయి. అయితే ఆ కేసులకు బాలీవుడ్ నటుడు సోనూ సూద్ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. బ్యాన్ చేసిన బెట్టింగ్ యాప్స్ ను సోనూ సూద్ ప్రమోట్ చేశారనే కేసు విచారణకు రావడంతో హాజరయ్యారు. చాలా సార్లు సమన్లు పంపినా హాజరుకాలేదు సోనూసూద్ . ఈ సారి విచారణకు హాజరయ్యారు.
కొన్నిరోజులుగా పంజాబ్‌లోనే ఉండి వరద బాధితులకు అండగా నిలిచిన సోనూ తాజాగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణలో భాగంగా.. బెట్టింగ్ యాప్‌ల ప్రచారం వాటితో సోనూ సూద్‌కి ఉన్న సంబంధాలు ప్రచారానికి తీసుకున్న డబ్బుల గురించి అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని టాక్. అయితే ఇప్పటికే ఈ కేసులో బుల్లి తెర..నుంచి బడా హీరోలు కూడా కేసు విచారణకు హాజరయ్యారు.
రీసెంట్ గా సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, నటి మంచు లక్ష్మి, నటుడు విజయ్ దేవరకొండ, రానా కూడా విచారణకు హాజరయ్యారు. ఇక బుల్లి తెర నుంచి అయితే అడగకుండా చిన్న చిన్న సెలబ్రెటీస్ ..యూట్యూబ్ స్టార్స్ అందరూఈ బెట్టింగ్ లావాదేవీల విషయంపై ఆరోపణలు ఎదుర్కున్నవారే. బ్లాక్ మనీ , బెట్టింగ్స్ లాంటి వాటిపై ఈడీ దర్యాప్తులు చాలా వేగంగా జరుగుతున్నాయి.