SUJEETH: సుజిత్ నెక్స్ట్ మూవీ ..నేచురల్ స్టార్ నాని తోనే !

 
యంగ్ డైరెక్టర్ సుజిత్ నెక్స్ట్ సినిమా మాత్రం టాలీవుడ్ నేషనల్ స్టార్ నానితో అని మాత్రం ఫిక్స్ అయింది. ఇప్పటికే నాని తో తీయబోయే సినిమాకు సంబంధించిన కథను సుజిత్ పూర్తి చేశాడట.


Published Sep 27, 2025 12:47:00 PM
postImages/2025-09-27/1758957602_nani41758899127.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పవన్ కళ్యాణ్ , సెన్సేషనల్ డైరక్టర్ గా సుజిత్ పేరు ప్రజెంట్ మారుమోగిపోతుంది. ఓజీ సెన్సేషన్ తో సుజిత్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. నెక్ట్స్ మూవీ ఎవరితో అనే డిస్కర్షన్ స్టార్ట్ అయ్యింది. చిన్న ఏజ్ లో టాలీవుడ్ బిగ్ స్టార్ట్స్ తో సూపర్ హిట్ సినిమాలు కొడుతున్నాడు.

 
యంగ్ డైరెక్టర్ సుజిత్ నెక్స్ట్ సినిమా మాత్రం టాలీవుడ్ నేషనల్ స్టార్ నానితో అని మాత్రం ఫిక్స్ అయింది. ఇప్పటికే నాని తో తీయబోయే సినిమాకు సంబంధించిన కథను సుజిత్ పూర్తి చేశాడట. ఇక నాని డేట్స్ ఇవ్వడమే బ్యాలెన్స్. కాని ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో ఈ ప్యారడైజ్డ్ అనే మూవీ చేస్తూ చాలా బిజీ గా ఉన్నారు. అయితే ఈ మూవీ కంప్లీట్ అయ్యాక సుజిత్ సినిమా కు డేట్లు ఇచ్చే అవకాశం ఉందట. సుజిత్ కూడా ఇటీవల ఇంటర్వ్యూలలో చెప్పుకుంటూ వస్తున్నారు.


నాని ది ప్యారడైజ్ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకునే టైంలో వీరిద్దరి కాంభినేషన్ లో రూపుదిద్దుకోవల్సిన  మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ మూవీ 2026 లో స్టార్ట్ చేస్తారట. ఈ చిత్రానికి సుజిత్ ఒక క్రేజీ టైటిల్ ని లాక్ చేశారని ప్రచారం జరుగుతుంది. బ్లడీ రోమియో అనే టైటిల్ ని ఫిక్స్ చేసి పెట్టుకున్నారట. మరి సినిమా స్టార్ట్ అయ్యాక సినిమా పేరు ఏమైనా ఛేంజ్ అవుతుందేమో చూడాలి.
 

newsline-whatsapp-channel
Tags : movie-news nani hero-

Related Articles