TANDEL: తండేల్ మూవీ రివ్యూ ...నాగచైతన్య కు హిట్ పడిందా !

మచ్చలేశం అనే ఊరు వాళ్ళు గుజరాత్ వెళ్లి ఒక తొమిది నెలలు సముద్రం మీద చేపల వేటకు వెళ్లి డబ్బులు సంపాదించి వస్తూ ఉంటారు.


Published Feb 07, 2025 03:55:00 PM
postImages/2025-02-07/1738924002_9105c8d14a4f41d68117c83f0e431885.jpeg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: నాగచైతన్య , సాయిపల్లవి జంటగా తెరకెక్కి సినిమా తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో చందూ మొండేటి డైరక్షన్ లో ఈ సినిమా భారీ బడ్జెట తో తెరకెక్కింది. ఈ రోజు ఫిబ్రవరి 7 న థియేటర్స్ లో రిలీజయింది.
రాజు(నాగ చైతన్య) బుజ్జి తల్లి(సాయి పల్లవి) చిన్నప్పటినుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం. మచ్చలేశం అనే ఊరు వాళ్ళు గుజరాత్ వెళ్లి ఒక తొమిది నెలలు సముద్రం మీద చేపల వేటకు వెళ్లి డబ్బులు సంపాదించి వస్తూ ఉంటారు. రాజు వాళ్ల నాన్న కూడా అదే పని చేసేవాడు . రాజు కూడా అలాగే వెళ్లేవాడు . రాజు వేటకు వెళ్లిన నెలలు బుజ్జి తల్లి రాజును గుర్తు చేసుకుంటూ గడిపేస్తుంది. కానీ రాజు బుజ్జి తల్లి మాట వినకుండా తాను తండేల్ కావడంతో తనని నమ్ముకున్న మత్స్యకారుల కోసం వేటకు వెళ్తాడు.


దీంతో బుజ్జి తల్లి రాజుని దూరం పెడుతుంది సముద్రంలోకి వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ కూడా ఉండవు కాబట్టి ఒడ్డు మీద ఉన్నప్పుడే కాల్ చేసి ఒకసారైనా మాట్లాడి వెళ్దాం అనుకుంటాడు. బుజ్జితల్లి దూరం పెడుతుంది. తన మాట కూడా వినకుండా వెళ్లిపోయాడని ...రాజుని మర్చి పోయి మరో పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. పెళ్లి సంబంధం కూడా ఓకే చేసేస్తుంది. అంతలో రాజు , అతనితో వెళ్లిన వాళ్లు అంతా సముద్రంలో తుఫాను రావడంతో అనుకోకుండా పాకిస్థాన్ జిల్లాలోకి వెళ్లి అక్కడి నేవి ఆఫిసర్స్ కి చిక్కి పాకిస్థాన్ జైలుకి వెళ్తారు. పాకిస్థాన్ లో రాజు పడ్డ బాధలు ఏంటి ...ఊళ్లో పరిస్థితులు ఏంటి ..పాకిస్థాన్ లో ఎందుకు అల్లర్లు చెలరేగాయి . 


సినిమా అంతా మంచి లవ్ స్టోరీ . డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నారు. ఇంట్లో వాళ్ళ కోసం మగవాళ్ళు ఎంత కష్టపడతారు, మగవాళ్ళు పనికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్లు ఏడుస్తూ పంపకూడదు, ఆడవాళ్ళని ఏడిపించకూడదు.. అని ఇలాంటి డైలాగ్స్ తో ఉన్న సీన్స్ బాగా పండి మంచి ఎమోషన్ ని ఇచ్చాయి. పాకిస్థాన్ జైలు సీన్స్ చాలా వరకు సినిమటిక్ లిబర్టీ తీసుకొని దేశభక్తి పాయింట్ లో రాసుకున్నారు.నాగచైతన్య యాక్టింగ్ అదిరిపోయింది. సాయిపల్లవి యాక్టింగ్ లో  బ్యూటీ కనిపించింది. నాగ చైతన్యకు తండేల్ కెరీర్లో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ప్రేమ కథల్లో అక్కినేని హీరోలని కొట్టే వాళ్ళు ఉండరని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. 


ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఊరి సెట్, మత్స్యకారుల పనిముట్లు, జైలు సెటప్.. అన్ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుంది. సినిమాకు డైలాగ్స్ చాలా ప్లస్ అయ్యాయి.చైతు కు పర్ఫెక్ట్ మాస్ హిట్ చైతు కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ 90 కోట్లు పెట్టారని సమాచారం. ఆ ఖర్చు అంతా తెరపై కనిపిస్తుంది. మరి ఇది కలెక్షన్స్ లో చైతన్యకు మొదటి 100 కోట్ల సినిమా అవుతుందేమో చూడాలి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagachaitanya tandel saipallavi

Related Articles