PAWANKALYAN: ఓజీ టీంకు బిగ్ షాక్ ...టికెట్ ధరపై స్టే ఇచ్చిన తెలంగాణ కోర్టు !

ఇటు ఇండియాలోనూ మొదటి రోజు రూ.55 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వసూళ్లు అయ్యాయి.


Published Sep 24, 2025 06:07:00 PM
postImages/2025-09-24/1758717518_og121758716152.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మానియా మామూలుగా లేదు. రేపే రిలీజ్ . వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీగా ఉన్నారు మూవీ టీం. టికెట్స్ అమ్మకాలు అదరగొడతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. యూఎస్ లాంటి ప్లేస్ లో ఆల్రెడీ 2.5 మిలియన్ టికెట్లు అమ్ముడు పోవడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇటు ఇండియాలోనూ మొదటి రోజు రూ.55 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వసూళ్లు అయ్యాయి.


ఓజీ ఈ రేంజ్ స్వాగ్ లో ఉంటే తెలంగాణ హైకోర్టు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. OG చిత్రానికి సంబంధించిన టికెట్ రేట్ల పెంపుపై కీలక ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది.రెండు రోజుల క్రితం తెలంగాణ ఓజీ మూవీకి టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ ఇస్తూ జీవో పాస్ చేసింది. ఈ మేరకు బెనిఫిట్ షోలు కూడా పర్మిషన్ ఇచ్చింది.కాగా సింగిల్ స్క్రీన్ టికెట్ రేటు పై రూ.100 పెంచుకునే అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు 10 రోజుల పాటు ఈ ఛాన్స్ ఉంది.


ఓజీ చిత్రం టికెట్ రేట్ల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సస్సెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి ఎన్వీ శ్రవణ్ కుమార్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటి లాగే ఓజీ రేట్లు నార్మల్ గా కొనసాగుతాయని ఇప్పటి వరకు కొనుక్కున్న టికెట్స్ పై ఎలాంటి నిర్ణయం ఉండబోతుందో తెలీదు కాని ప్రస్తుతానికి ఓజీ టికెట్స్ పై ఎలాంటి ధరల పెంపు ఉండదని మాత్రం తేల్చేసింది హైకోర్టు.
 

newsline-whatsapp-channel
Tags : pawankalyan movie-news price-drop telanganahighcourt

Related Articles