tomcruse: నాలుగోపెళ్లికి ...అంతరిక్షంలో ఏర్పాట్లు చేస్తున్న హాలివుడ్ హీరో !

చాలా కాలంగా ఈ జంట డేటింగ్ లో ఉన్నారట...చాలా సీక్రెట్ రిలేషన్ లో ఉన్నారు. ఇప్పుడు రిలేషనే ఫ్యాన్స్ కి షాక్ అంటే డైరక్ట్ గా స్పేస్ లో చేసుకుంటున్నారట.


Published Oct 03, 2025 10:59:00 AM
postImages/2025-10-03/1759469412_TomCruise17592891844461759289184568.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హాలివుడ్ స్టార్ టామ్ క్రూజ్ గురించి ఇంగ్లీష్ సినిమాలు చూసే ఎవ్వరికైనా పరిచితమే. అసలు యాక్షన్ లవర్స్ టామ్ క్రూజ్ ఇంట్రడక్షన్ కూడా ఇవ్వక్కర్లేదు. అయితే సార్ ఇప్పుడు హాలివుడ్ లోనే కాదు వరల్డ్ లో ఫుల్ వైరల్ అవుతున్నారు. సినిమాల కోసం ప్రాణం పెట్టే టామ్ ఇప్పుడు పెళ్లికి డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. 63 ఏళ్ల వయసులో సార్ పెళ్లికి ప్లాన్ చేస్తున్నారు. అది కూడా తనలో సగం వయసులో హాలీవుడ్ స్టార్ బ్యూటీ అనా డి ఆర్మాస్ తో పెళ్లికి రెడీ అయ్యారు. అయితే చాలా కాలంగా ఈ జంట డేటింగ్ లో ఉన్నారట...చాలా సీక్రెట్ రిలేషన్ లో ఉన్నారు. ఇప్పుడు రిలేషనే ఫ్యాన్స్ కి షాక్ అంటే డైరక్ట్ గా స్పేస్ లో చేసుకుంటున్నారట.


టామ్ క్రూజ్ బైక్ స్టంట్లు, ఫ్లైట్స్ నుంచి దూకేయడం, రియల్ స్టంట్లు చేయడంలో ఆయన తోప్. మిషన్ ఇంపాజిబుల్ లాంటి మూవీస్ టామ్ క్రూజ్ కు సినిమా లపై ఆయనకున్న ప్యాషన్ ను తెలుస్తుంది. అయితే టామ్ కు ఇది నాలుగో పెళ్లి ...గతంలో మూడు పెళ్లిళ్లు జరిగాయి. మిమిరోజర్స్ ను పెళ్లి చేసుకొని విడాకులు చేసుకున్నారు. తర్వాత నికోల్ కిడ్ మన్ , కేటీ హోమ్స్ ను పెళ్లి చేసుకొని బైబై చెప్పేసుకున్నారు. ఇప్పుడు డి ఆర్మాస్ ను స్పేస్ లో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.


ఈ హీరోయికి ఇప్పటికే న‌లుగురు పిల్లలు కూడా ఉన్నారు . ఇక అనా డి ఆర్మాస్ కూడా గతంలో మార్క్ కొల్టేట్ అనే స్పానిష్ యాక్ట‌ర్‌ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మేడం హాలీవుడ్ స్టార్ బెన్ అప్లెక్ , క్యూబా ప్రెసిడెంట్ కుమారుడితో లవ్ ఎఫైర్స్ నడిపింది. ఇప్పుడు తన కన్నా డబుల్ ఏజ్ ఉన్న టామ్ క్రూజ్ తో రెండో పెళ్లికి సిధ్ధమయ్యింది. మరి వీరి పెళ్లి  ఏ రేంజ్ లో జరుగుతుందో తెలియాలి. స్పేస్ లో పెళ్లి విషయాలు మాత్రం ఫ్యాన్స్ కు సడన్ సర్ ప్రైజ్ ఇస్తారట వెయిట్ చేద్దాం. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu marriage hollywood space

Related Articles