NAINIKA : అల్లు శిరీష్ వైఫ్ నైనికా ఎవరు ..ఎంత రిచ్చో తెలుసా !

ఇప్పుడు సోషల్ మీడియా అంతా అసలు శిరీష్ వైఫ్ ఎవరు ఏంటి..ఎక్కడ అమ్మాయి అనే క్వశ్చన్సే.


Published Oct 03, 2025 04:29:00 PM
postImages/2025-10-03/1759489274_allusirish.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ లో చాలా మంది బ్యాచిలర్స్ హీరోలు ఉన్నారు. అందులో అల్లు శిరీష్ ఒకరు ..ఆ లిస్ట్ నుంచి శిరీష్ బైబై చెప్పేస్తున్నారు. రీసెంట్ గా  సింగిల్ పోస్ట్ తో తను సింగిల్ కాదని చెప్పేశాడు. అయితే ఈ మధ్యే పేరెంట్స్ ఒప్పేసుకున్నారట. తన సోషల్ మీడియా ద్వారా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలిపాడు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా అసలు శిరీష్ వైఫ్ ఎవరు ఏంటి..ఎక్కడ అమ్మాయి అనే క్వశ్చన్సే.


తన గర్ల్ ఫ్రెండ్  నయనిక తో ఎంగేజ్‌మెంట్ జరగనుందని, ఈ నెల 31న నిశ్చితార్థం జరగనున్నట్లు తెలిపారు. శిరీష్ ఓ పోస్ట్‌లో 'మా తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా, నా మనసుకు బాగా దగ్గరైన విషయాన్ని మీతో పంచుకుంటున్నా. నేను, నయనిక ఈ నెల 31న నిశ్చితార్థం చేసుకోబోతున్నాం. నా పెళ్లి చూడాలని నా నానమ్మ ఎప్పుడు కోరుకునేది. ఆమె మా మధ్య లేకపోయినా తన ఆశీస్సులు మాపై ఉంటాయని నమ్ముతున్నామని తెలిపారు


 అయితే నయనిక అల్లు శిరిష్ తో చాలా కాలంగా లవ్ లో ఉన్నారు. ఆమె యాక్టర్ , డ్యాన్సర్ తో పాటు బిజినెస్ కూడా చేస్తుందట.అయితే  ఈ అక్టోబర్ 31 వ తేదీన ఎంగేజ్మెంట్ జరగనుంది అయితే తన కాబోయే వైఫ్ తో ఐఫిల్ టవర్ దగ్గర దిగిన పిక్ తో ఫొటో షేర్ చేశాడు. దీని పై చాలా మంది సెలబ్రెటీస్ కంగ్రాట్స్ చెప్తూ కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్లు కూడా శుభాకాంక్షలతో శిరీష్ ను విష్ చేస్తున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : viral-news allu-sirish wedding social-media-post

Related Articles