వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉసిరికాయలు చాలా బాగా ఉపయోగపడుతుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఉసిరికాయల సీజన్ వచ్చేసింది. పచ్చళ్లు , ఉసిరి పొడులు లాంటివి చేస్తూ ఏదో రకంగా ఉసిరికాయలు తినాలి. అసలు ఉసిరి శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో ఏంటో తెలుసుకుందాం.వాతావరణం మారినప్పుడల్లా మన రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. దీనివల్ల మనకు సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులతో పాటుగా ఎన్నో ఇతర వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉసిరికాయలు చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో పాటుగా మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉసిరి తినడం వల్ల జీర్ణక్రియ చక్కగా ఉంటుంది.
పుల్లని ఉసిరికాయ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఉసిరికాయను తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.
ఉసిరికాయను తింటే మలబద్దకం అనే సమస్యే ఉండదు. అలాగే గట్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఉసిరి కడుపు ఆమ్లాన్ని సమతుల్యం చేసి, మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
శరీరంలో ఐరన్ డెఫిషియన్సీ కూడా సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి ఆర్థరైటిస్, ఇతర తాపజనక సమస్యలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.దీనిలో విటమిన్-సి, ఫైబర్, భాస్వరం, ఫోలేట్, కాల్షియం, పిండి పదార్థాలు, మెగ్నీషియం, ఇనుము, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఉసిరి శరీరానికి వరం లాంటిది.