Colon Cancer : కొలన్ కాన్సర్ ఎందుకు వస్తుంది..లక్షణాలు ఏంటి ?

పెద్దప్రేగు క్యాన్సర్ పెద్ద ప్రేగులని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు యూత్ తింటున్న ఫుడ్స్ కు ఎక్కువగా వస్తున్న క్యాన్సర్ కూడా ఇదే.


Published Nov 02, 2024 10:42:00 AM
postImages/2024-11-02/1730524418_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొలన్ క్యాన్సర్ అంటే పెద్ద ప్రేగు క్యాన్సర్ . యువతరంలో పెరుగుతున్న అతి పెద్ద సమస్య. టీనేజ్ కుర్రాళ్ల నుంచి ..పెద్ద వాళ్ల వరకు ఎక్కువగా వచ్చే అవకాశాలున్న క్యాన్సర్.  ఇది పురుషుల్లో మూడవ అత్యంత సాధారణ క్యాన్సర్, మహిళల్లో రెండో అత్యంత సాధారణ క్యాన్సర్. పెద్దప్రేగు క్యాన్సర్ పెద్ద ప్రేగులని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు యూత్ తింటున్న ఫుడ్స్ కు ఎక్కువగా వస్తున్న క్యాన్సర్ కూడా ఇదే.

 

కుటుంబంలో ఎవరికైనా పెద్ద ప్రేగు క్యాన్సర్ ఉంటే ఆ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారికి సమస్య ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్లు ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఓ సారి చూపించుకొని జాగ్రత్తగా ఉండడమే మంచిది.
ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, రెడ్‌మీట్, ప్రాసెస్డ్ మీట్ కూడా పెద్ద ప్రేగు క్యాన్సర్‌ని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయి.డా. కెమికల్స్ కలిపిన ఆహారం తినడం వల్ల కూడా ఈ కొలన్ క్యాన్సర్ వస్తుంది.


కడుపు క్యాన్సర్ కోసం రేడియేషన్ థెరపీ చేయించుకున్న వ్యక్తులకి పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. చిన్న వయసులో రేడియేషన్ థెరపీ చేయించుకున్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కారణం రేడియేషన్ కారణంగా ఆ ప్రదేశంలో క్యాన్సర్ కణాలతో పాటు మంచి కణాలు కూడా చనిపోతాయి. కాబట్టి ఆ ఎఫక్ట్ పెద్దప్రేగుపై చాలా ఎక్కువ పడుతుంది.లక్షణాలు అభివృద్ధి చెందడానికి ముందు స్క్రీనింగ్, పరీక్షలు సజెస్ట్ చేస్తారు. జాగ్రత్తలు వహించకపోతే ...ఈ క్యాన్సర్లు ...పేరు తెలియని రోగాలతో చాలా కష్టం. కనీసం ఏడాదికోసారి మెడికల్ టెస్టులు చేయించుకుంటే ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-news food-habits cancer

Related Articles