KIDS : పిల్లల్లో విటమిన్ "డి" తగ్గితే ఎంత ప్రమాదమో .. ఎన్ని ఆరోగ్యసమస్యలు !


పిల్లలు ఆటలు ఆడుతున్నప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగలడం కామన్. కానీ.. కొన్నిసార్లు ప్రమాదవశాత్తు చేయో, కాలో కూడా విరుగుతూ ఉంటాయి


Published Oct 23, 2024 11:55:00 AM
postImages/2024-10-23/1729664772_samayamtelugu103711943.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మనం ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలంటే అన్ని విటమిన్స్ చాలా ఇంపార్టెంట్ . విటమిన్ డి .. ప్రత్యేక స్థానం. బోన్స్ గట్టిగా ఉండాలంటే డి విటమిన్ కంపల్సరీ. ప్రధానంగా బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు వివిధ అవయవ వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.  పిల్లలు హైట్ రావడానికి కూడా డి విటమిన్ కావాలి. ఎంత హెల్దీ గా ఉంటే ..అంత హైట్ వెయిట్ పర్ఫెక్ట్ ఎదుగుదల ఉంటుంది పిల్లల్లో.


పిల్లలు ఆటలు ఆడుతున్నప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగలడం కామన్. కానీ.. కొన్నిసార్లు ప్రమాదవశాత్తు చేయో, కాలో కూడా విరుగుతూ ఉంటాయి.ఇలాంటి టైంలో డీ విటమిన్ కాని సరిగ్గా లేకపోతే బోన్స్ అతుక్కోవడం చాలా చాలా కష్టం.పిల్లల ఎదుగుదలలో, బోన్స్ దృఢంగా మారడంలో "విటమిన్ డి" కీలకపాత్ర పోషిస్తున్నట్లు మరోసారి ఈ పరిశోధన ద్వారా వెల్లడైంది. కాబట్టి.. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పిల్లలకు డైలీ తగినంత మోతాదులో డి విటమిన్ అందేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


డైలీ డైట్ లో కంపల్సరీ పప్పులు, తృణధాన్యాలు, గ్రీన్ వెజ్జీస్ కంపల్సరీ . హెల్దీ ఫుడ్ ను ఇవ్వండి. కాల్షియం కోసం తప్పని సరి గా పాలు , పెరగు  , నువ్వులు , వీటిలో డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. రోజు పిల్లల్ని ప్రధానంగా ఎండలో చర్మం చురుక్కు మనేవరకూ ఉండనివ్వాలి. అంటే.. సుమారు ఇరవై నిమిషాల నుంచి గంట వరకూ సమయం పట్టొచ్చంటున్నారు. అప్పుడే.. శరీరానికి తగినంతగా విటమిన్‌ డి అందుతుంది. ఎముకలు బలం పుంజుకునేలా చేస్తుందంటున్నారు నిపుణులు.పిల్లలకు డి విటమిన్ టానిక్స్ కాదు...నేచురల్ గా కాసేపు ఎండలో ఆడుకోనివ్వండి. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu broken-bones health-benifits vitamin-ab kids

Related Articles