తెలంగాణ పోలీసులు ఎప్పటికప్పుడు భారీ ఎత్తున డ్రగ్స్ ముఠాలపై దాడులు చేసి అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా ఈ ఒక్కరోజే మూడు వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు నాలుగున్నర కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ముఠా వద్ద 620 గ్రాముల రూ.4 కోట్ల 30 లక్షల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.
న్యూస్ లైన్ డెస్క్ : రాష్ట్రంలో డ్రగ్స్ స్మగ్లర్ల దూకుడు రోజురోజుకు పెరిగిపోతోంది. రకరకాల మార్గాల్లో డ్రగ్ వ్యాపారులు రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను చలామణి చేస్తూ యువత జీవితాలను చిత్తు చేస్తున్నారు. కాగా.. తెలంగాణ పోలీసులు ఎప్పటికప్పుడు భారీ ఎత్తున డ్రగ్స్ ముఠాలపై దాడులు చేసి అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా ఈ ఒక్కరోజే మూడు వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు నాలుగున్నర కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ముఠా వద్ద 620 గ్రాముల రూ.4 కోట్ల 30 లక్షల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఘట్ కేసర్ లోని ఓ షాప్ వేదికగా విక్రయిస్తున్న వారిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఆన్ లైన్ వేదికగా రాష్ట్రంలో గుట్టుగా జరుగుతున్న గంజాయి చాక్లెట్ల విక్రయాన్ని పోలీసులు బట్టబయటు చేశారు. గంజాయి చాక్లెట్లను తయారు చేసి ఆన్ లైన్ లో అమ్ముతున్న 8 కంపెనీలను పోలీసులు గుర్తించారు. ఈ కామర్స్ వెబ్ సైట్ ద్వారా రాష్ట్రానికి గంజాయి చాక్లెట్లు సప్లై అవుతున్నట్టు గుర్తించిన తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు ముఠాను అరెస్టు చేశారు. గుజరాత్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ లకు చెందిన 8 కంపెనీలను సీజ్ చేశారు.