బాలింతలకు పెట్టే ఆహారంలో బంక లడ్డూలను కూడా చేర్చుకోవటం వల్ల మరింత ప్రయోజనం అంటున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బాలింతలు ప్రత్యేక ఆహారనియమాలుంటాయి. నిజానికి అవన్నీ చాలా ఆరోగ్యకరమైనవే...కారణం బాలింతలకు పోషకాహారాలు బాగుండాలి. అప్పుడే తల్లిపాలు పుష్టిగా ఉంటాయి ..బిడ్డకు ఆరోగ్యంగా ఉంటుంది. అదే గోండ్ కటిరా , గోంద్ కతీరా ...ఇవి రెండు ప్రత్యేకంగా లడ్డూలు చేసి తినిపిస్తారు.
బాలింతలకు పెట్టే ఆహారంలో బంక లడ్డూలను కూడా చేర్చుకోవటం వల్ల మరింత ప్రయోజనం అంటున్నారు.
నిపుణులు. గోంద్ కటిరా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ప్రోటీన్, కాల్షియం, డైటరీ ఫైబర్, మెగ్నీషియం వంటి అనేక మినరల్స్‌తో పాటు విటమిన్లు కూడా ఉంటాయి. గోండ్ కటిరా తినడం వల్ల డైజిషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ప్రొటీన్ మీ కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో మేలు చేస్తుంది. కణజాలాలను రిపేర్ చేస్తుంది. అంతేకాదు మీ ఫిజికల్ గా వదులుగా ఉన్న కండరాలను బిగుతుగా చేస్తుంది. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో, అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడతాయి.
వేసవిలో అరికాళ్లు, కాళ్ల మంట సమస్య ఉన్నవారు గోండు కటిరను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ముఖ్యంగా బాలింతల్లో జుట్టు రాలిపోతుంటుంది. అది జరగకుండా చేస్తుంది. చర్మాన్ని చాలా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.ఒత్తిడిని తగ్గించడంలో ప్రయోజనకరంగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అయితే దీనిని సాంప్రదాయ వంటకం గా ఇంట్లో తయారుచేస్తారు.