ఎక్కువ అయ్యే ఆహారాలు తినడం వల్ల కూడా ఈ సమస్య మరింత పెరుగుతుంది. కొన్ని ఫుడ్స్ కూడా ఫ్యాటీ లివర్ ను మరింత పెంచుతాయి. అవేంటో చూసేద్దాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రీసెంట్ గా డయాబెటిక్స్ ఎంత మంది ఉన్నారో ఫ్యాటీ లివర్ సమస్య తో ఇబ్బంది పడే వారు కూడా అంతే ఉన్నారు. చాలా వరకు వ్యాయామం లేకపోవడం . మెంటర్ ప్రెజర్ తో పాటు ..ఫుడ్ ..ఇన్సులిన్ ఎక్కువ అయ్యే ఆహారాలు తినడం వల్ల కూడా ఈ సమస్య మరింత పెరుగుతుంది. కొన్ని ఫుడ్స్ కూడా ఫ్యాటీ లివర్ ను మరింత పెంచుతాయి. అవేంటో చూసేద్దాం.
* పళ్ల రసాలు..
చాలా మంది పళ్ల రసాలు ఆరోగ్యకరమని భావిస్తూ తరచూ తీసుకుంటూ ఉంటారు. పండ్లు తినడం మంచిది . ఫైబర్ ఉంటుంది. మీ గట్ హెల్త్ చాలా బాగుంటుంది. అదే పండ్ల రసాలు పిప్పిని మొత్తం తొలగించి ఇవ్వడం వల్ల వాటిలో ఉండే షుగర్ లెవెల్స్ మీ శరీరంలో ఇన్సులిన్ ను మరింత పెంచుతాయి. అసలు ఇన్సులిన్ ను హ్యాండిల్ చెయ్యలేకే కదా..కాలేయం దెబ్బతిన్నది మీ పండ్ల రసాలు ఆ ప్రాబ్లమ్ ను మరింత పెంచుతాయి.
‘* ఆల్కహాల్...
ఫ్యాటీ లివర్ సమస్యకు ముఖ్య కారణాల్లో ఇదీ ఒకటి. ఆల్కహాల్ శరీరంలో కాలేయంలోనే విచ్ఛిన్నమవుతుంది. ఈ సందర్భంగా వెలువడే హానికర రసాయనాలు కాలేయాన్ని దెబ్బతీస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్యను మరింతగా పెంచుతాయి. అసలు ఆల్కహాల్ అలవాటే మంచిది కాదు. మత్తు మీ కష్టాన్ని మాయం చెయ్యదు..మిమ్మల్ని ప్రపంచాకి దూరం చేస్తుంది.
* కూల్ డ్రింక్స్...
పండ్లరసాలు..కూల్ డ్రింక్స్ ఈ కేటగిరీలో రెండు ఒకటే...మనకు లిక్విడ్ షుగర్స్ వెళ్లకూడదు. అది పండ్లరసాలైన , కూల్ డ్రింక్స్ అయినా...కూల్ డ్రింక్స్ అయితే ఓ రవ్వ మరీ హానికరం ..కెమికల్ రియాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి.
* ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్...
వేగంగా శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తాయని చెప్పే... ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్ లో కొన్నింటిలో అత్యధిక స్థాయిలో కెఫీన్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఎనర్జీ కోసం పాటు పడేవారు...దీనిని వాడినా కాలేయం ఇబ్బందుల్లో పడడం తప్ప మరొక ఉపయోగం లేదు.