Burj Khalifa: బూర్జ్ ఖలీఫా ఓనర్ ఎవరో తెలుసా.? 2024-06-26 20:14:53

న్యూస్ లైన్ డెస్క్: ప్రపంచంలోనే ఎత్తయిన కట్టడాల్లో మొదటి స్థానంలో నిలిచింది బూర్జు ఖలీఫా. దుబాయ్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరు దీన్ని తప్పనిసరిగా చూడాలనుకుంటారు. దీని కింద నుంచి చూస్తే ఆకాశంలోకి ఆనుకున్నట్టు ఉంటుంది.  అలాంటి బుర్జు ఖలీఫా వరల్డ్ లోనే ఎంతో పేరు గాంచిన నిర్మాణం. అలాంటి ఈ నిర్మాణానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంత పెద్ద కట్టడాన్ని దుబాయిలో ఎలా నిర్మించారు అనేది చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే దుబాయిలో పూర్తిగా ఇసుక ఉంటుంది.

ఇసుకలో నిర్మాణాలు చేయడం అంటే కష్టం, కూలిపోయే అవకాశాలు ఎక్కువ.  అయినా ఇక్కడ బూర్జు ఖలీఫాను ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగా, అద్భుతమైన హంగులతో నిర్మించారు. దీనికి ప్లానింగ్ ఇచ్చిన ఇంజనీర్స్ చాలా గొప్పవారు అని చెప్పవచ్చు. మొత్తం దీని ఎత్తు 828 మీటర్లు. ఈ బిల్డింగ్ మొత్తం 163 అంతస్తులుగా ఉంటుంది. అలాంటి బూర్జు కలీఫాను దుబాయ్ వెళ్లిన వారు మాత్రమే చూడగలరు మిగతా వారందరూ గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది.

అలాంటి ఈ బూర్జు కలీఫాను ఎవరు నిర్మించారు అనే విషయానికి వస్తే దీని అసలు ఓనర్ మహమ్మద్ అల్బర్.  ఈయన emaar ప్రాపర్టీస్ కంపెనీలకు బాస్. అలాంటి ఈ బూర్జు ఖలీఫా పేరుపై మొత్తం ఎనిమిది ప్రపంచ రికార్డులు నెలకొన్నాయి. ఇందులో ఒకటి ఎత్తైన భవనం మరియు ఎత్తైన లిఫ్ట్ కూడా రికార్డు లోకి ఎక్కింది. అంతేకాకుండా 95 కిలోమీటర్ల దూరంలో ఎక్కడికి  వెళ్ళినా ఈ భవనం కనిపిస్తుంది. అలాగే ఇంకా కొన్ని ప్రపంచ రికార్డులు ఈ భవనంలోనే ఉన్నాయి.