ఆపరేషన్ సిందూర్’ పేరిట చేపట్టిన ఈ చర్యలో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారతదేశంపై ఉగ్రదాడులకు కుట్రలు పన్నుతున్న వాటిని నిర్దేశిస్తున్న పాక్ లోని ఉగ్రవాద మౌళిక సదుపాయాలపై భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట చేపట్టిన ఈ చర్యలో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.
భారత సాయుధ దళాలు అత్యంత సమన్వయంతో ఈ ఆపరేషన్ ను నిర్వహించాయి. పాకిస్థాన్ లో ని బహవల్ పూర్ , మురిడ్కే , సియాల్ కోట్ లాంటి ప్రాంతాల్లో నాలుగు, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఐదు చొప్పున మొత్తం తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలను విజయవంతంగా ఛేధించినట్లు ఏఎన్ ఐ వార్తా సంస్థకు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో చాలా శక్తివంతమైన ఆయుధాలు వినియోగించినట్లు సమాచారం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రంతా ఈ "ఆపరేషన్ సిందూర్" ను నిరంతరం పర్యవేక్షించారు. దాడులు జరిగిన తొమ్మిది లక్ష్యాలు పూర్తిగా ధ్వంసమైనట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతునిస్తున్న జేషేమొహమ్మద్ , లష్కరే తోయిబా అగ్రశ్రేణి నాయకులను లక్ష్యంగా చేసుకొని ఈ ప్రాంతాలను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని పేరు పెట్టడం వెనుక ఒక ప్రత్యేకమైన సంకేతం ఉందని భావిస్తున్నారు. సంప్రదాయంగా, సిందూరం వివాహిత హిందూ మహిళలు ధరిస్తారు. అయితే, ఈ ఆపరేషన్ సందర్భంలో పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన దాడి ఘటనలకు ఈ పేరు ప్రతీకగా నిలుస్తుందని నమ్ముతున్నారు. అందుకే ఈ ఆపరేషన్ కు సిందూర్ పేరు పెట్టారట. అంతేకాదు ఈ మరణాలన్నీ హిందువా కాదా అనేది అడిగి మరీ చేశారు. కాబట్టి హిందువుల రక్తం ఎంత పదునైన పనులు చేయగలదో చూపించడానికి కూడా ఈ పేరు ను పెట్టినట్లు చెబుతున్నారు.