Bangladesh: చిన్నయి కృష్ణదాస్‌కు దక్కని ఊరట !

ఆయన బెయిల్ కోసం పదకొండు మంది లాయర్ల బృందం ప్రయత్నించింది. కాని అక్కడి చటోగ్రాం కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.


Published Jan 02, 2025 08:48:00 PM
postImages/2025-01-02/1735831177_hindumonkchinmoykrishnadasarrestedinbangladesh26512575016x90.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బంగ్లాదేశ్ జైల్లో ఉన్న ఇస్కాన్ గురువు చిన్మయి కృష్ణదాస్ కు అక్కడి కోర్టులో బెయిల్ లభించలేదు. దేశద్రోహం నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన బెయిల్ కోసం పదకొండు మంది లాయర్ల బృందం ప్రయత్నించింది. కాని అక్కడి చటోగ్రాం కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.


బెయిల్ పిటిషన్‌పై అరగంట పాటు చటోగ్రాం కోర్టులో వాదనలు జరిగాయి. ఈ రోజు విచారణ సంధర్భంగా కోర్టు దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రస్తుతానికి చిన్మయి కృష్ణదాస్ కు బెయిల్ ఇవ్వలేమని కోర్టు తెలిపింది.


 బంగ్లాదేశ్ జెండాను ఆవమానించారనే ఆరోపణలతో 2024 నవంబర్ 25న పోలీసులు చిన్మయి కృష్ణదాస్ ను అరెస్ట్ చేశారు. తర్వాత అతనిని జైలుకు పంపించారు. కృష్ణదాస తరుపున వాదనలు వినిపించేందుకు ప్రయత్నించిన లాయర్లపై దాడులు జరిపారు. దీంతో ఆయన కేసు ఎవ్వరు తీసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు.అయితే చిన్మయి భాగస్వామిగా ఉన్న సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే అనే సంస్థ పదకొండు మంది లాయర్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu national krishna bangladesh

Related Articles