USA: అమెరికాలో విచిత్రమైన పరిస్థితి... ఓవైపు కార్చిచ్చు... మరోవైపు మంచు తుపాను!


మంచు తుపాను కారణంగా అమెరికాలో ఇప్పటిదాకా ఐదుగురు మరణించారు. కొన్ని ప్రాంతాల్లో మైనస్ 18 డిగ్రీల సెల్సియస్ లకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.


Published Jan 11, 2025 11:59:32 PM
postImages/2025-01-11//1736620172_images3.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: అమెరికా పూర్తిగా ప్రకృతి విపత్తులతో విలవిలలాడుతుంది. ఓ కార్చిర్చు మరో వైపు మంచు తుఫాన్లు ...3 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేల సంఖ్యలో విమానాలు ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని ఐదు రన్ వేలను మూసివేశారు. 


మంచు తుపాను కారణంగా అమెరికాలో ఇప్పటిదాకా ఐదుగురు మరణించారు. కొన్ని ప్రాంతాల్లో మైనస్ 18 డిగ్రీల సెల్సియస్ లకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏంజెలిస్ నగరాన్ని కార్చిర్చు దహనం చేసేసింది. దాదాపు 10 వేల భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి. హాలీవుడ్ స్టార్లు సైతం విలాసవంతమైన భవనాలను వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి వచ్చింది.

కార్చిచ్చు కారణంగా ఇప్పటిదాకా 11 మంది మరణించారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాదాపుగా రూ.13 లక్షల కోట్ల మేర ఆస్తినష్టం సంభవించిందని అంచనా.

newsline-whatsapp-channel
Tags : america

Related Articles