పాక్ ఆక్రమించుకున్న ప్రాంతం ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని... చట్టవిరుద్ధంగా పాకిస్థాన్ ఆక్రమించిన కశ్మీర్ భూభాగాలను ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కాశ్మీర్ లో కొంత భాగం పాకిస్థాన్ ఆక్రమించిందని తెలుసుకదా. అయితే ఇప్పుడు పాకిస్థాన్ ఆక్రమించిన కాశ్మీర్ ను వెంటనే తిరిగి ఇవ్వాల్సిందని భారత్ వార్నింగ్ ఇచ్చింది.పాక్ ఆక్రమించుకున్న ప్రాంతం ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని... చట్టవిరుద్ధంగా పాకిస్థాన్ ఆక్రమించిన కశ్మీర్ భూభాగాలను ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది.
శాంతి పరిరక్షణ సంస్కరణలపై ఐక్యరాజ్యసమితిలో చర్చ సంధర్భంగా పాకిస్థాన్ ప్రతినిధి మాట్లాడుతూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ ..పాకిస్థాన్ అనవసర అంశాలను లేవనెత్తుందని అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ లో కొంత ప్రాంతం ఇప్పటికీ పాక్ ఆక్రమణలోనే ఉందని... దాన్ని పాకిస్థాన్ ఖాళీ చేయాల్సిందేనని అన్నారు. పాకిస్థాన్ కుతంత్రాలు చేయడం మానుకుంటే మంచిదని హితవు పలికారు.