అబు ఖతల్ అలియాస్ ఖతల్ సింధి నిన్న రాత్రి పాకిస్థాన్ లో హత్యకు గురయ్యాడు. జెహ్లం సింధ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పాకిస్థాన్ కు చెందిన కరుడు గట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అబు ఖతల్ అలియాస్ ఖతల్ సింధి నిన్న రాత్రి పాకిస్థాన్ లో హత్యకు గురయ్యాడు. జెహ్లం సింధ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపేశారు.
జమ్ముూ కాశ్మీర్ లో చాలా దాడులకు ఈ అబుల్ ఖతల్ సూత్రధారి. అబుఖతల్ 26/11 ముంబై దాడుల మాస్టర్ ప్లాన్ వేసిన హఫీజ్ సయూద్ కు అత్యంత సన్నిహితుడు . గతేడాది జూన్ 9న జమ్ము కాశ్మీర్ రియాసీ జిల్లాలోని శివఖోరి ఆలయం నుంచి భక్తులతో వస్తున్న బస్సుపై జరిగి ఉగ్రదాడిలో అబుఖతల్ మెయిన్ లీడ్. అతడి నాయకత్వంలోనే ఈ దాడికి పథక రచన జరిగింది.
అబుఖతల్ ను హఫీజ్ సయాద్ లష్కరే తోయిబా చీఫ్ ఆపరేషనల్ కమాండర్ గా నియమించాడు. కశ్మీర్ దాడులకు హఫీజ్ ఇచ్చే ఆదేశాలను అబు ఖతల్ పాటించేవాడు.. 2023 రాజౌరీ దాడుల కేసులో అబు ఖతల్ పేరును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది.