maldives: మాల్దీవుల అధ్యక్షుడిపై క్షుద్రపూజలు.. ఇద్దరు మంత్రుల అరెస్టు

Published 2024-06-28 15:57:38

postImages/2024-06-28/1719570458_images1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏం జరిగిందో ఏమో తెలీదు కాని ..మాల్దీవ్స్ ఈ మధ్య  తెగ వార్తల్లో వైరల్ అయిపోతుంది. మాల్దీవుల ( maldives)అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జుకు వ్యతిరేకంగా ఆయన మంత్రివర్గ సహచరులే చేతబడి లాంటి క్షుద్రపూజలు( black magic)  చేశారన్న వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి.


పర్యావరణ సహాయమంత్రిగా విధులు నిర్వహిస్తున్న షమ్నాజ్ సలీం, అధ్యక్షుడి కార్యాలయ మంత్రిగా ఉన్న ఆమె మాజీ భర్త రమీజ్‌లతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారట. అసలు ఎందుకు ఈ అరెస్ట్ విషయంపై ...పోలీసులు నోరు కూడా మెదపలేదు.


‘‘షమ్నాజ్‌తో పాటు మరో ఇద్దరినీ ఆదివారం ( sunday) ఆరెస్టు చేయగా, ఈ ముగ్గురికీ ఏడు రోజుల కస్టడీ రిమాండు విధించారు. అయితే ఇంటర్నేషనల్ మీడియా మాత్రం ఈ విషయాన్ని గగ్గోలు పెట్టేస్తుంది. అంతేకాదు బుధవారం ఆమెను పర్యావరణ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. అలాగే రమీజ్‌ను గురువారం మంత్రి పదవి నుంచి తప్పించారు’’ అని ఓ వార్తా వెబ్‌సైట్ పేర్కొంది. గతంలో ముయిజ్జు మాలె సిటీ మేయర్‌గా ఉన్నప్పుడు షమ్నాజ్, రమీజ్ కౌన్సిలర్లుగా ఆయనతో కలిసి పనిచేశారు. ఇంకా మల్దీవ్స్ లో ఏం ఏం జరుగుతాయో చూడాలంటున్నారు...నెటిజన్లు.