Telangana: ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్

Published 2024-07-02 16:44:11

postImages/2024-07-02/1719918851_modi17.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ పచ్చజెండా ఊపింది. పలు శాఖల్లోని 3035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

ఈ ఖాళీల భర్తీ కోసం ఇటీవల ఆర్టీసీ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించిన విషయం తెలిసిందే. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం వివిధ కేటగిరిల్లో 3035 పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2000 డ్రైవర్‌ పోస్టులతో పాటు 743 శ్రామిక్‌ ఉద్యోగాలు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. వివిధ విభాగాల్లోని 25 డిపో మేనేజర్లు/అసిస్టెంట్ ట్రాఫిక్‌ మేనేజర్లు,  15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ పోస్టులు, 114 డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) ఖాళీలను భర్తీ చేయనున్నారు. 

డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) విభాగంలో 84, 23 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, 11 సెక్షన్ ఇంజినీర్‌తో పాటు 6 అకౌంట్స్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు మెడికల్ ఆఫీసర్స్ జనరల్ విభాగంలో 7, మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్‌ విభాగంలో 7 ఖాళీలను భర్తీ చేయనున్నారు.