Govt Jobs: ఇండియన్ నావీలో 270 పోస్టులు.. ఎస్ఎస్ సీ నోటిఫికేషన్ !

పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీలలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్య్యూకు పిలవనున్నట్లు వెల్లడించింది. 


Published Feb 13, 2025 12:48:00 PM
postImages/2025-02-13/1739431175_IndianNavySSCOfficerRecruitment.webp

న్యూస్ లైన్ స్పెషల్ డెస్క్: ఇండియా నౌకాదళంలో వివిధ పోస్టలు భర్తీకి షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్ సీ) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 270 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదని, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొంది. పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీలలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్య్యూకు పిలవనున్నట్లు వెల్లడించింది. 


ఈ పోస్టుల ఎంపికకు అకడమిక్ ప్రతిభను కొలమానంగా చూస్తామని, యూజీ/పీజీలో ఎక్కువ మార్కులు పొందినవారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తామని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు ఎజిమాళ నేవల్‌ అకాడెమీలో 22 వారాల పాటు శిక్షణ, ఆపై సంబంధిత విభాగాల్లో మరో 22 వారాలు శిక్షణ ఉంటుందని తెలిపింది.


ఎంపికైన అభ్యర్థులు డీఏ, హెచ్ఆర్ఏ సహా ఇతరత్రా ప్రోత్సాహకాలు కలుపుకుని మొదటి నెల రూ.1.10 లక్షల వేతనం అందుకుంటారని చెప్పింది. సంబంధిత డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్ సీసీ అభ్యర్థులకు అకడమిక్ మార్కుల్లో 5 శాతం సడలింపు వర్తిస్తుంది. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులను సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటామని పేర్కొంది. 


ఖాళీలు, అర్హతలు:


ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌: 60
అర్హత: ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్‌లో 60% మార్కులతో ఉత్తీర్ణత.

ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌: 15
అర్హత: బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ

టెక్నికల్‌ బ్రాంచ్‌: 101
ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో 60% మార్కులతో బీఈ/బీటెక్‌ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు

వయసు: జనవరి 2, 2001/2002 - జనవరి 1, 2005/2006/2007 మధ్య జన్మించి ఉండాలి. ఫిబ్రవరి 25 ఆఖరి తేదీ.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu

Related Articles